తెలంగాణ

ఇక భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: తెలంగాణ భూసేకరణ చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేడో రేపో చట్టం అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇళ్లు, భూములు కోల్పోయే రైతులకు ఓకేసారి నష్టపరిహారం చెల్లించే అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చనున్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం లక్ష ఎకరాలకుపైగా భూములు సేకరించేందుకు వీలుగా భూసేకరణ విభాగంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లను నియమించనున్నారు. ఆగస్టు నెలాఖరులోగా భూసేకరణ పనులు ముగించి వేగవంతంగా ప్రతిష్టాకరమైన ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. రైతులకు ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను హైకోర్టు కొట్టివేయడం, తెలంగాణ భూసేకరణ చట్టం రూపొందించడం, సవరణలు చేయడం, రాష్టప్రతి ఆమోదం తదితరమైన పనుల వల్ల దాదాపు ఐదు నెలల సమయం జాప్యమైంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.400 కోట్లకు పైగా భారం పడినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయ. కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం ఇళ్లు కోల్పోతే రూ.75 వేలతో కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. కాని రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల విలువ చేసే డబుల్ బెడ్‌రూం నిర్మించి ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. భూసేకరణ వల్ల భూమి, ఇల్లు ఇతర స్ధిరాస్తులను కోల్పోయే రైతులకు డబుల్ బెడ్‌రూం నిర్మాణానికి అయ్యే వ్యయంతో కలిపి మొత్తం సొమ్మును ఒకే చెక్‌గా ఇచ్చేలా మార్గదర్శకాల్లో చేర్చనున్నట్లు సమాచారం. భూమి లేని నిరుపేదలకూ కొత్త చట్టం కింద సంతృప్తిపర్చేలా పరిహారం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులకు మొత్తం 3 లక్షల ఎకరాలు అవసరమైతే, హైకోర్టు కొట్టేసిన జీవో 123 కింద 60 వేల ఎకరాలు సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 69,048 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇంతవరకు 23,968 ఎకరాలను సేకరించారు. ఇంకా 45 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు 25,587 ఎకరాలు అవసరమని గుర్తించి 11,833 ఎకరాలు సేకరించారు. మిగిలిన 13,754 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దేవాదుల స్టేజి-2 కింద 31031 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, 23,560 ఎకరాలను సేకరించారు. మరో ఏడు వేల ఎకరాలు సేకరించాలి. ఎఎంఆర్‌పి ప్రాజెక్టుకు 16వేల ఎకరాలకుగాను 9570 ఎకరాలను సేకరించారు. మరో 6430 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కల్వకుర్తి ప్రాజెక్టుకు అదనంగా వెయ్యి ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. భూసేకరణ చట్టం అమలులో ఎదురవుతున్న సమస్యల వల్ల 23 ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ వేసవిలో వీటి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టివుంటే జాప్యం ఉండేదికాదని సాగునీటి నిపుణులు పేర్కొన్నారు. హైకోర్టు జీవో 123 కొట్టివేసినప్పటి నుంచి కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద ఒక గ్రామ ప్రజలు 120 ఎకరాల భూమి సేకరణను అనుమతించకపోవడం, కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రం రూపొందించిన 2013 భూసేకరణ చట్టానికి లోబడి తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వేగంగా అమలు చేసేందుకు, భూమి సేకరణకు కొత్తగా అదనపు భూసేకరణ అధికారులను నియమించేందుకూ ప్రభుత్వం అంగీకరించింది.