తెలంగాణ

ప్లాన్ ‘బి’కే సర్కార్ మొగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్ స్థలం కేటాయించడానికి రక్షణ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించడంతో కొత్త సచివాలయం నమూనాపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. కొత్త సచివాలయ నిర్మాణానికి ముంబయికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నమూనాలను ఇదివరకే సమర్పించిన విషయం తెలిసిందే. సచివాలయ నిర్మాణానికి స్థలం ఎంపికలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఈ నమూనాలపై ప్రభుత్వం అప్పట్లో దృష్టి సారించలేదు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణం, బైసన్ గ్రౌండ్‌లో సచివాలయ నిర్మాణానికి ఈ రెండు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. అయితే బైసన్ గ్రౌండ్ స్థలం ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించకపోవడం, చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మాణాన్ని ఆస్పత్రి సిబ్బంది, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఏప్రిల్ చివరన ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ సందర్భంగా సచివాలయ నిర్మాణానికి తాజాగా పరేడ్ గ్రౌండ్ స్థలాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ ఇవ్వబోయే స్థలానికి పదింతల స్థలాన్ని హైదరాబాద్ నగర పరిధిలోనే కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రధానికి సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ చేసిన నమూనాలను తాజాగా ముఖ్యమంత్రి పరిశీలించినట్టు తెలిసింది. ప్లాన్ ‘ఎ’ ప్రకారం 10 అంతస్తుల భవనం, 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, ‘యు’ ఆకారంలో నిర్మాణానికి రూ. 350 కోట్లు వ్యయంఅవుతుంది. ప్లాన్ ‘బి’ ప్రకారం 6 అంతస్తుల భవనం, ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రూ. 200 కోట్ల వ్యయం. ప్లాన్ ‘ఎ’ లో సూచించినట్లుగా 10 అంతస్తుల ఎత్తయిన భవనానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. పరేడ్ గ్రౌండ్‌కు దగ్గర్లోనే బేగంపేట విమానాశ్రయం ఉంది. ప్రస్తుతం వివిఐపిల పర్యటనలకు దీనిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదంతస్తులు కాకుండా 6 అంతస్తుల భవనం నిర్మించడం వల్ల ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి అభ్యంతరం ఉండదని, పైగా నిర్మాణ వ్యయం కూడా 150 కోట్ల నుంచి 200 కోట్లవరకు తగ్గనుండటంతో ప్లాన్ ‘బి’ నమూనా పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ మొగ్గు చూపుతున్నట్టు అధికార వర్గాల సమాచారం.