హైదరాబాద్

ఆఫ్రికా దేశాల్లో భారతదేశ డిగ్రీ పట్టాలకే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, మే 21: ఆఫ్రికా దేశాల్లో మన విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీ పట్టాలకు మంచి గుర్తింపు, విలువ ఉన్నాయని పిఐబీ అదనపు సంచాలకుడు డాక్టర్ సుధాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని హోటల్ మారియట్‌లో ఆఫ్రికా స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ ఐదో సంయుక్త గ్రాడ్యుయేట్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యా ప్రమాణాలు పాటించడం వల్ల మన పట్టాలకు విలువ ఎక్కువని అన్నారు. అంతేకాకుండా చాలా దేశాలలో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఎక్కువని అందుకే అనేక మంది విదేశీయులు మన దేశానికి తరలి వస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.పద్మాచారి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాకుండా దాని అనుబంధ కళాశాలల్లో కూడా అనేక మంది విదేశీవిద్యార్ధులు చదువుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆఫ్రికా స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఆజా పీటర్ మాట్లాడుతూ 32 ఆఫ్రికా దేశాలే కాకుండా ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల నుండి వందల మంది విద్యార్ధులు వస్తున్నారని అన్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న వారంతా ఏదో ఒక చోట కలుసుకుని వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని ఆజా పీటర్ తెలిపారు. పు