హైదరాబాద్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం 31న అమృతరెడ్డి కరాటే ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 21: గిన్నిస్‌బుక్ రికార్డు కోసం ఓ చిన్నారి కరాటేలో సాహస విన్యాసాలు చేయబోతోంది. బర్కత్‌పురలోని జివిఆర్ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న 12 సంవత్సరాల బాలిక జి. అమృతరెడ్డి ఈనెల 31వ తేదిన తన ప్రదర్శన ఇవ్వబోతోందని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్‌రెడ్డి ఆదివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పడి మూడు సంవత్సరాలైన సందర్భంగా 36 గ్రానైట్స్‌ను, 1095 రోజులు గడిచిన సందర్భంగా 1095 మేకులతో ఉన్న అంపశయ్యపై పడుకుని గ్రానైట్స్‌ను పగలగొట్టే విన్యాసం చేయబోతుంది. బర్కత్‌పురలోని కరాటే అకాడమీలో కరాటే మాస్టర్స్ పర్యవేక్షణలో ప్రతి రోజు శిక్షణ తీసుకుంటోందని వివరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ రికార్డ్సు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా పేరు కోసం ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో సాహసోపేతమైన విన్యాసం చిన్నారి అమృత చేయనున్నట్లు తెలిపారు.