తెలంగాణ

రాష్ట్రం పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర చరిత్రలో రికార్డుస్థాయి దిగుబడి

25.95 లక్షల మెట్రిక్ టన్ముల ధాన్యం సేకరణ 42 లక్షల మెట్రిక్ టన్నులకు రావచ్చని అంచనా

హైదరాబాద్, మే 22: రాష్ట్ర ప్రభుత్వం కలలుగంటోన్న బంగరు తెలంగాణకు ఈ యాసంగి (రబీ) నుంచే సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వ అంచనాలకు మించి ధాన్యం దిగుబడి రావడంతో, సమీప భవిష్యత్‌లోనే తెలంగాణ సైతం ధాన్యాగారం కావొచ్చన్న ఆనందం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్‌కు వచ్చిన యాసంగి దిగుబడి రాష్ట్రంలో కొత్త ఆశలు మొలకెత్తిస్తోంది. ఈ సీజన్‌లో రికార్డుస్థాయిలో ఇప్పటికే 25.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కొనుగోళ్లు జరుగుతోన్న జిల్లాల్లో నెలాఖరుకు మరో పది నుంచి పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగికి ముందే రాష్ట్రంలో మంచి వర్షాలు కురియడం, చెరువులు నిండుకుండల్లా మారడంతో వరి సాగు విస్తరించి ఊహించిన దానికంటే ఎక్కువ దిగుబడి అందిందని అంటున్నారు. పౌర సరఫరాల సంస్థ ఇప్పటి వరకు 25.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 3.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత యాసంగి ధాన్యం సేకరణకన్నా ఈసారి 18.65 లక్షల మెట్రిక్ టన్నుల అదనంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ మొత్తానికి 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చని తొలుత అంచనా వేసినా, తాజా లెక్కల ప్రకారం మూడు వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 42.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరవచ్చని చెబుతున్నారు. 2015-16 రబీ సీజన్‌లో ఇదే సమయానికి 1262 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,51,950 మంది రైతుల నుంచి 7 లక్షల 28 వేల 829 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
జిల్లాల వారీ లెక్కలు
నల్లగొండలో 3.33 లక్షల మెట్రిక్ టన్నులు, సూర్యాపేట 1.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. యాదాద్రిలో 2 లక్షలు, ఖమ్మం నుంచి 1.5 లక్షలు, కరీంనగర్‌లో 2.75 లక్షలు, నిజామాబాద్‌లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పెద్దపల్లిలో 3.5, జగిత్యాలలో 3.54, కామారెడ్డి జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సిరిసిల్లలో 1.82 లక్షలు, మెదక్‌లో రెండు లక్షలు, సిద్దిపేటలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మంచిర్యాలలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ముగింపు దశకు చేరుకున్నాయి. మిగిలిన జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు సాగుతున్నాయి.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుపుతున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆనంద్ వెల్లడించారు. 2979 కొనుగోలు కేంద్రాల ద్వారా 4,45,373 మంది రైతుల నుంచి 3917.46 కోట్ల రూపాయల విలువ చేసే 25.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యన్ని ఇప్పటి వరకూ కొనుగోలు చేశామన్నారు. వీటిలో ఇప్పటి వరకు 2081.01 కోట్లు విడుదల చేసి, 1848.46 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినట్టు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఇంకా పది నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.