కృష్ణ

‘నీరు-ప్రగతి’లో రోల్ మోడల్ మనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 22: జిల్లాలో చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమాల వల్ల అదనంగా 50వేల హెక్టార్ల భూమి సాగులోకి రానుందని జిల్లా కలెక్టర్ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీరు-ప్రగతి అమలులో కృష్ణాజిల్లా రోల్ మోడల్‌గా మారిందన్నారు. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 50వేల హెక్టార్ల భూమి సాగులోకి రావటంతో పాటు రూ.170కోట్లు జివిఎ పెరగనుందన్నారు. జిల్లాలో సామూహిక నీటి కుంటలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలకు కూడా ఉపయోగపడే విధంగా నాలుగు లేదా ఐదు ఎకరాల్లో నీటి కుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులందరినీ ఒప్పించి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీకి సొంత భవనంతో పాటు అంగన్‌వాడీ కేంద్రం, స్ర్తి శక్తి భవనం, సిసి రోడ్లు, డ్రైన్‌లు, శ్మశాన భూమిని అభివృద్ధి చేయాలన్నారు. పే ఫీల్డ్, పంట కుంటలు, ఇంకుడు గుంటలు ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో విద్యార్థులచే నీటి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత అంశాల్లో ప్రగతి సాధించిన వారికి మాత్రమే స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రశంసా అవార్డులు ఇస్తామన్నారు. జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి బయోమెట్రిక్ ద్వారా మాత్రమే అటెండెన్స్ వేయాలన్నారు. సోమవారం 10.15 గంటలకు, మిగిలిన రోజుల్లో 10.30 గంటలకు ప్రతి ఉద్యోగి వేలిముద్రలు వేసి విధులకు హాజరు కావాలన్నారు. లేకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు క్యాంప్‌లకు వెళ్లే వారు నిర్ణీత సమయానికి ముందుగానే బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి మూమెంట్ రిజిస్టర్‌లో నమోదు చేసి వెళ్లాలన్నారు. ప్రతి కార్యాలయంలో ఈ రిజిస్టర్‌ను పెట్టాలన్నారు. వసతి గృహాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు దాతల సహకారంతో చేపట్టిన ‘స్వీకారం’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. వసతి గృహాల పునః ప్రారంభ రోజైన జూన్ 12వతేదీన అన్ని వసతి గృహాల్లో స్వీకారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అలాగే వర్షాలు కురిసిన వెంటనే నీటిని ఆహ్వానిస్తూ నీటి పండుగ చేయాలన్నారు. ఇకపై మీకోసంలో వచ్చే ప్రతి అర్జీ ఈ-ఆఫీస్‌కు బదిలీ కానున్నట్లు తెలిపారు. మీకోసం అర్జీలను ఈ-ఆఫీస్ లింక్‌ను కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పిటిషన్ ఆడిటింగ్ సిస్టంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, డిఇఓ ఎ సుబ్బారెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, హౌసింగ్ పిడి శరత్ బాబు, సోషల్ వెల్ఫేర్ జెడి ప్రసాద్, మత్స్య శాఖ జెడి యాకూబ్ బాషా, డియస్‌ఓ నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ మూర్తి, డిఐఓ శర్మ తదితరులు పాల్గొన్నారు.