కృష్ణ

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 22: ఈ నెల 24, 25తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. మంత్రులందరికీ ఆయా శాఖల జిల్లా అధికారులే లైజనింగ్ ఆఫీసర్లుగా ఉంటారన్నారు. అలాగే కలెక్టర్లకు తహశీల్దార్లను లెజైనింగ్ అధికారులుగా నియమించామన్నారు. మంత్రుల పిఎలు, కలెక్టర్ల సిసిలతో మాట్లాడి వారంతా ఎప్పుడు వస్తారు.., ఎలా వస్తున్నారు.. తెలుసుకుని వాహన సదుపాయం కల్పించి వారికి కేటాయించిన వసతి ప్రాంతాలకు తీసుకువెళ్లాలన్నారు. అలాగే కాన్ఫరెన్స్ జరిగే ఎ1 కనె్వన్షన్ సెంటర్‌లో సకల సదుపాయాలు కల్పించాలన్నారు. ఎటువంటి లాంచింగ్ కార్యక్రమాలు ఉన్నా వెంటనే తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రోటోకాల్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.