తెలంగాణ

మళ్లీ వేతనాల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిశుధ్య కార్మికులకు సర్కారు వరం 12.5 వేల నుంచి 14 వేలకు పెంపు
తొలుత జిహెచ్‌ఎంసిలో అమలు ఆపై రాష్టవ్య్రాప్తంగా పెంచే యోచన
కార్మికుల శ్రమను గుర్తిస్తాం: సిఎం కెసిఆర్

హైదరాబాద్, మే 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో (జిహెచ్‌ఎంసి) పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.1500 మేర పెంచాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జిహెచ్‌ఎంసి మాదిరిగా రాష్టవ్య్రాప్తంగా ఇతర మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాలూ పెంచుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు పడుతున్న శ్రమను గుర్తించి గతంలోనే సిఎం ఒకసారి వేతనాలు పెంచారు. అదే సందర్భంగా మరోసారి కూడా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్‌లో మంగళవారం మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి జనార్దన్‌రెడ్డి తదితరులతో సిఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని మంత్రి కెటిఆర్, అధికారులు కోరగానే ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి పారిశుధ్య కార్మికుల వేతనం రూ.8500 ఉండగా, దీన్ని సిఎం రూ.12,500కు గతంలో పెంచా రు. తిరిగి మరోసారి రూ.1500 పెంచాలని తాజాగా నిర్ణయించడంతో ప్రస్తుతం వీరి వేతనం రూ.14 వేలకు చేరుకోనుంది. జిహెచ్‌ఎంసి కార్మికుల మాదిరిగా ఇతర మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కార్మికుల వేతనం పెంచాలని మంత్రి కెటిఆర్ సూచించగానే సిఎం సానుకూలంగా స్పందించారు. ఆయా మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి, పన్నుల వసూళ్ల వివరాలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను సిఎం ఆదేశించారు. ఆ వివరాలు అందిన తర్వాత వారికీ వేతనాలు పెంచడంపై సిఎం నిర్ణయం ప్రకటించనున్నారని సిఎంవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

చిత్రం.. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుపై అధికారులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్