రాష్ట్రీయం

పట్టుకోసం పాకులాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు టి.టిడిపి మహానాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు
ఒకవైపు విశ్వాసం... మరోవైపు సంఘటిత పోరాటం కార్యకర్తలకు ధైర్యం చెప్పనున్న బాబు

హైదరాబాద్, మే 23: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ పట్ల విశ్వాసం కల్పించడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై ధైర్యంగా, సంఘటితంగా పోరాటం సలిపేం దుకు దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించ బోయే తెలంగాణ తెదేపా మహానాడు వేదిక కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి దఫా మహానాడు నిర్వహించేందుకు టి.టిడిపి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు హాజరుకానున్నారు. సుమారు 20 వేల మంది హాజరవుతారని పార్టీ నేతల అంఛనా. మహానాడులో ఎనిమిది తీర్మానాలు ఆమోదించనున్నారు. ఈ తీర్మానాలను విశాఖపట్నంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు పంపిస్తారు. తెలంగాణ మహానాడు నిర్వహణకు ముందే ఇటీవల జిల్లాల వారీగా మినీ మహానాడులు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువే ఉన్నందున, ఇప్పటి నుంచే పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు మహానాడు ద్వారా శంఖారావం పూరించాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో తెలుగుదేశం అస్థిత్వం కోల్పోయిందన్న భావన నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలను బయటకు తెచ్చేందుకు మహానాడు ఉపయోగపడాలని నాయకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు కాబట్టి ఇకనైనా తెలంగాణకు నెలకు ఒక్క రోజైనా సమయం కేటాయించాలని పార్టీ నేతలు వేదికనుంచే చంద్రబాబును కోరనున్నారు. చంద్రబాబు సమయం కేటాయిస్తే తప్ప తెలంగాణలో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్తేజం రాదన్న భావనతో సీనియర్లు ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పోరాటం చేస్తేనే పార్టీ మనుగడ సాధించగలదని చంద్రబాబు తన ప్రసంగంలో చెప్పనున్నారు. పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్‌లో చేరినందున, వారి స్థానంలో కొత్త నాయకులను తయారు చేయాలని, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేసేలా కార్యాచరణ కూడా సిద్ధం చేయనున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు.