తెలంగాణ

కట్టుబడే ఉన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్లు ఇచ్చామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటన వివాదాలకు దారితీస్తోంది. అమిత్ షా చెప్పింది అంతా అవాస్తవమేనని తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు ఆరోపించగా, తాను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నానని అమిత్ షా లెక్కలతో సహా వివరించారు. తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన చివరి రోజు బుధవారం రాత్రి మెహిదీపట్నం క్రిస్టల్ గార్డెన్స్‌లో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కోసం ఏంచేశారని కొంతమంది ప్రశ్నిస్తున్నారని, మూడేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలా? వద్దా? అంటూ అమిత్ షా బహిరంగ సభలో ప్రశ్నించారు. సభికులను పదే పదే మీరేమంటారు? మేం చెప్పాలా వద్దా? అంటూ నిలదీశారు. దానికి సభికుల నుంచి చెప్పాలి అని సమాధానం రాగానే అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల జాబితాను వివరించారు. తెలంగాణకు ఉపకారం చేయడం తమ బాధ్యత అని, సాయం కోరడం తెలంగాణ ప్రజల హక్కని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి గత ప్రభుత్వం ఏంచేసిందో, తాము గత మూడేళ్లలో ఏంచేశామో వివరించామని, దానిని మీడియా సరిగా అర్థం చేసుకోలేదన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇచ్చామని, ట్రైబల్ యూనివర్శిటీ, హార్టికల్చర్ యూనివర్శిటీ, పివి నర్సింహరావు వెటర్నరీ యూనివర్శిటీ ఇచ్చామని వివరించారు. హైదరాబాద్ -బెంగలూరు జాతీయ రహదారికి, హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి, యాదాద్రి -్భద్రాచలం రహదారి విస్తరణకు 40 వేల కోట్లు ఇచ్చామని, గృహనిర్మాణానికి 5 వేల కోట్లు ఇవ్వడంతోపాటు 90 వేల ఇళ్లు కేటాయించామని వివరించారు. మహిళా సంక్షేమానికి 1059.39 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 116.32 కోట్లు, ఆరోగ్య శాఖకు 975 కోట్లు, నీటిపారుదలకు 489.68, గిరిజన సంక్షేమానికి 451.86 కోట్లు, డిజిటలైజేషన్‌కు 236.87 కోట్లు ఇచ్చామని వివరించారు. 13వ పంచవర్ష ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ 9785 కోట్లిస్తే, 14వ పంచవర్ష ప్రణాళికలో 96,706 కోట్లు ఎన్డీయే ఇచ్చిందన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2101 కోట్లు ఆనాడిస్తే, తాము 9 వేల కోట్లు ఇచ్చామని, అలాగే స్థానిక సంస్థలకు గత పాలకులు 249 కోట్లు ఇస్తే తాము 8754 కోట్లు ఇచ్చామని అమిత్ షా లెక్కలు వివరించారు. తెలంగాణకు తాము ఏమిచ్చామో చెప్పినదానికి కట్టుబడి ఉన్నానని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పునరుద్ఘాటించారు.

చిత్రం... మెహిదీపట్నంలో కార్యకర్తలతో నిర్వహించిన సభలో బాణం ఎక్కుపెట్టి చూపిస్తున్న అమిత్ షా