తెలంగాణ

టి.ఫైబర్ గ్రిడ్‌తో చేతులు కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భాగస్వాములు కావాలంటూ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన టెలికాం దిగ్గజాలను ఐటి మంత్రి కె తారకరామారావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ మూడోరోజు బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. నోకియా, ఎరిక్‌సన్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టామని, ప్రతి గ్రామాన్నీ ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానిస్తున్నట్టు వివరించారు. కెటిఆర్ సూచన పట్ల నోకియా కంపెనీ సానుకూలంగా స్పందించింది. ఫైబర్ గ్రిడ్ కోసం జారీ చేయబోయే ఆర్‌ఎఫ్‌పిలో పాల్గొంటామని నోకియా హామీ ఇచ్చింది. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అనలిటిక్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని, మొబైల్ పరికరాల తయారీ ప్లాంట్, ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశంపై పరిశీలించాలని నోకియాను మంత్రి కోరారు. ఈ సందర్భంగా ఎరిక్‌సన్ కంపెనీలో పర్యటించి అక్కడి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పరిశీలించారు. ఎరిక్‌సన్ చేస్తున్న పరిశోధనలను పరిశీలించారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ అత్యుత్తమ వ్యాపార విధానాలను అమలు చేస్తోందని, వాటిని వివరించారు. సోలార్, ఐటి రంగాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.
మ్యూల్‌సాప్ట్ కంపెనీ ప్రతినిధుల బృందంతోనూ కెటిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, ప్రభుత్వం తరఫున అనేక రాయితీలు ఇవ్వడమే కాకుండా వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. మ్యూల్‌సాప్ట్ కంపెనీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగరాన్ని తమ ప్రణాళికలో చేరుస్తామని ఈ సందర్భంగా ప్రతినిధులు కెటిఆర్‌కు హామీ ఇచ్చారు.
స్టార్టప్ కంపెనీలకు సేవలు అందించేందుకు స్ట్రైప్ కంపెనీతో మంత్రి కెటిఆర్ చర్చించారు. ఆర్థిక సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న స్ట్రైప్ కంపెనీ తెలంగాణలో తమ కంపెనీ ఏర్పాటుకు యోచిస్తామని హామీ ఇచ్చింది. సిలికాన్ వ్యాలీలో టి-హబ్ ఏర్పాటు చేసిన టి-బ్రిడ్జితో కలిసి పనిచేస్తామని కంపెనీ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు హామీ ఇచ్చారు.

చిత్రం... దిగ్గజ టెలికాం కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్