హైదరాబాద్

ఆర్టీఏ ఇన్‌స్పెక్టర్ స్వాతిగౌడ్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లారీ డ్రైవర్‌పై బౌన్సర్లతో దాడి అభియోగం
* రహస్య విచారణ.. నిర్థారించిన అధికారులు
* అధికారిణి వ్యవహారంపై సీరియస్.. సస్పెన్షన్ వేటు

హైదరాబాద్, మే 24: హైదరాబాద్ తిరుమలగిరి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిధి దాటి వాహనాలు తనిఖీ చేస్తూ, లారీ డ్రైవర్‌పై బౌన్సర్లతో దాడి చేయించడం, అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆమె అభియోగాలున్నాయి. ఇటీవల ఎల్‌బినగర్ చౌరస్తాలో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు సిసి టివి కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఆమెపై ఆర్టీఏ ఉన్నతాధికారులు రహస్య విచారణ జరిపించారు. విచారణలో అధికారిణి వ్యవహారం నిర్ధరణకు వచ్చింది. దీంతో స్వాతిగౌడ్ వ్యవహారంపై సీరియస్‌గా తీసుకున్న అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
అసలేం జరిగిందంటే?
సికిందరాబాద్ తిరుమలగిరి ఎఎంవిఐ స్వాతిగౌడ్ శనివారం రాత్రి సాగర్ రింగ్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రైవేటు లారీకి ఆమె చలానా రాశారు. కాగా, చలానా విషయంలో లారీ ఓనర్‌కు, ఇన్‌స్పెక్టర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఆవేశంతో ఊగిపోయిన స్వాతిగౌడ్, లారీ ఓనర్ శ్రీకాంత్‌రెడ్డిపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా బౌన్సర్లతో శ్రీకాంత్‌రెడ్డిని కొట్టించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాడి అనంతరం శ్రీకాంత్‌రెడ్డి ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో విధులకు ఆటంకం కలిగించాడని లారీ ఓనర్‌పై స్వాతిగౌడ్ రివర్స్ ఫిర్యాదు చేశారు. అయితే, బాధితుడి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎఎంవిఐ స్వాతిగౌడ్‌పై కేసు నమోదు చేయలేదు. ఆమె ప్రభుత్వ అధికారిణి, న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు పెడతామని బాధితుడికి చెప్పారు. కాగా స్వాతిగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు శ్రీకాంత్‌రెడ్డిని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. ఈ విషయం బహిర్గతం కావడంతో సమస్య జటిలమైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వాతిగౌడ్‌పై అభియోగాలు రుజువుకావడంతో ఆమెను సస్పెండ్ చేశారు.