ఆంధ్రప్రదేశ్‌

ప్రజలే ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: ప్రజలకు పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన అవినీతి రహిత పాలనను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలే ముందు అన్న భావనకు శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అధికారులు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ, ప్రజలే ముందు అన్న భావన కలెక్టర్లు, ప్రభుత్వం కలిగి ఉండాలని, అప్పుడే సత్ఫలితాలు రాబట్టవచ్చన్నారు. ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగాలన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. ప్రజలే ముందు లోగోను, హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే, గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్‌లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ప్రజలే ముందు అన్న పేరుతో ప్రభుత్వం ఒక సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 1100 కాల్ సెంటర్‌ను కూడా ఆయన ఈ సదస్సులోనే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలే ముందులో భాగంగా మీకోసం, ఎపి సిఎం కనెక్టు, కాల్ సెంటర్, ఖైజాలా యాప్ ద్వారా వచ్చే సమస్యలను ఏకీకృతం చేస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1100 కాల్‌సెంటర్‌కు ఎవరైనా ఫోన్ చేయవచ్చన్నారు. వచ్చే ఫిర్యాదులను విశే్లషించేందుకు 750 సీట్లతో ఈ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ఆధారంగా కలెక్టర్ల పనితీరును సమీక్షించే వీలు కూడా ఉంటుందన్నారు. సిఎం డాష్ బోర్డు తరహాలో కలెక్టర్ల డాష్‌బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వర్షపాతం, భూగర్భ జలాల వివరావను ఆటోమైజేషన్ చేశామని గుర్తు చేశారు. త్వరలో మెషిన్ లెర్నింగ్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మీ సామర్ధ్యం నిరూపించుకొండి
కలెక్టర్లకు సిఎం పిలుపు
అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పేద ప్రజలందరూ సంతృప్తి చెందేలా సంక్షేమ పథకాలను చివరి వ్యక్తి వరకూ తీసుకువెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి సాధించేందుకు దేశానికి రాష్ట్రం ఆదర్శంగా ఉండాలన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా, 2022 నాటికి దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఎపి నిలవాలన్నారు. ప్రజలను గౌరవించి, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యున్నత విధానాలు, అభ్యాసాలను అనుసరిద్దామని పిలుపునిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఐటికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రపంచంలోనే అత్యున్నత తలసరి వేతనం కలిగిన వారిగా తెలుగువారు నిలవడమే ఉదాహరణగా తెలిపారు. నరేగా నిధుల వినియోగంలో సంస్కరణలు తేవడం ద్వారా నిధుల సమస్య అధిగమించామన్నారు. ఏడు మిషన్లపై ఇక ప్రతినెల సమీక్షలు జరుపుతామన్నారు. ఐదు ప్రచార ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వ్యవసాయం కంటే అనుబంధ రంగాల ద్వారా అధిక ఆదాయం లభిస్తోందన్నారు. నీరు-చెట్టు, స్వచ్ఛాంద్రప్రదేశ్, కుటుంబ వికాసం తదితర అంశాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. అందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో 10 లక్షల గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రాన్ని ఒడిఎఫ్‌గా చేసేందుకు లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విద్యా భద్రత, పశుగ్రాస భద్రత, సమాచార భద్రత, ఉపాధి భద్రత, వ్యక్తిగత భద్రత, ఆదాయ భద్రత కల్పిస్తున్న రాష్ట్రం మనదేనన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టామని, సౌర విద్యుత్ యూనిట్ ధర 16 రూపాయల నుంచి 2.4 రూపాయలకు తగ్గిందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే, తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామన్నారు. దీనిపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే స్థాయికి చేరుకున్నామని, పిడుగులు ఎక్కడ పడుతాయో కచ్చితంగా చెప్పే సాంకేతిక అందిపుచ్చుకున్నామన్నారు. భూగర్భ జలాలు 3 మీటర్ల కంటే లోపు ఉండేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలన్నారు. భూగర్భ జలాలు పెరిగితే దాదాపు 6000 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఆదా అవుతుందన్నారు.

చిత్రం... కలెక్టర్ల సదస్సులో ‘ప్రజలే ముందు’ లోగోను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు