తెలంగాణ

తెలంగాణ నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: ఆదాయ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మరోసారి నంబర్-వన్‌గా నిలిచింది. దేశంలోని మరే రాష్ట్రంలో నమోదు కానంతటి 17.82 శాతం ఆదాయవృద్ధి రేటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో నమోదు అయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ సమాచారాన్ని అధికారికంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో తెలంగాణ ధనిక రాష్టమ్రని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పదే పదే చెప్పే విషయం అక్షర సత్యమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ధ్రువీకరించింది. కాగ్‌కు ఫిబ్రవరి నెలాఖరు వరకు అందిన ఆదాయ వివరాల మేరకు రాష్ట్రంలో ఆదాయ వృద్ధి 17.82శాతంగా నమోదు అయింది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనుండటంతో ఈ శాతం మరికొంత శాతం పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రధానమైన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82శాతం వృద్ధి రేటు సాధించగా, అన్ని రకాల ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 17.81 శాతం వృద్ధి రేటు సాధించింది. అమ్మకం పన్ను, ఎక్సైజు ఆదాయం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలు 17.82శాతం వృద్ధిరేటు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం 2015-16లో మార్చి నుంచి ఫిబ్రవరి వరకు రూ.33,257 కోట్ల ఆదాయం రాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.39,183 కోట్ల ఆదాయం లభించింది. దీంతో ప్రధానమైన పన్నుల ద్వారా తెలంగాణ రాష్ట్రం 17.82శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. రవాణాశాఖతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా 2015-16ఆర్థిక సంవత్సరంలో రూ.36,130 కోట్ల ఆదాయం సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం 2016-17లో రూ.42,564 కోట్ల ఆదాయం సాధించింది.
సిఎం కెసిఆర్ హర్షం
ఆదాయ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం రెండు విభాగాలలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలువడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందని ఉద్యమ సమయంలో తాను చెప్పింది అక్షర సత్యమని రుజువు అయిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నోట్ల రద్దు వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం తగ్గకుండా వృద్ధి సాధించడం విశేషమని ముఖ్యమంత్రి అన్నారు. ఆదాయ వృద్థి రేటు పెరగడంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకుపోతామన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఆదాయ వృద్ధి సాధించడం పట్ల రాష్ట్ర అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.