తెలంగాణ

పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ ఐటి, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా, అమెరికాలోని వివిధ సంస్థల అధినేతలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు కోరారు. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో గురువారం ఆయన సమావేశమై వివరంగా చర్చించారు. తెలంగాణ రాష్టర్రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న సహజ వనరుల గురిం చి వివరిస్తూ, ఐటి, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు. పటిష్ఠమైన ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. తొలుత ఇంటెల్ కంపెనీ ప్రెసిడెంట్ (తయారీ, నిర్వహణ, అమ్మకాలు) స్టాసీ స్మిత్‌తో పాటు కంపెనీ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాబర్ట్ హెచ్ స్వాన్‌తో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రగతి, వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు రావాలంటూ వారిని ఆహ్వానించారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటైన ఫ్లెక్స్ లిమిటెడ్ అధ్యక్షుడు డగ్‌బ్రిట్‌తో కెటిఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు డగ్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పభుత్వం చేపట్టిన టి వర్క్స్ ప్రాజెక్టుతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమ అనుబంధ కంపెనీ నెక్స్ ట్రాకర్ ల్యాబ్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని డగ్‌బ్రిట్ స్పష్టంగా చెప్పారు. సోలార్, స్టోరేజ్ రంగాల్లో కొత్త ఉత్పత్తులకు అవకాశం ఉంటుందన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ క్లౌడ్ ఎరాతో కెటిఆర్ సమావేశమయ్యారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్, పోలీస్, రెవెన్యూ విభాగాల్లో ఉపయోగిస్తున్న డాటా అనాలిటిక్స్ కార్యక్రమాలను కెటిర్ వివరించారు. హైదరాబాద్‌లో డాటా అనాలిటిక్స్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇందులో భాగస్వామ్యం కావాలంటూ ఆయన కోరారు.
గ్లోబల్ పౌండ్రీ సిఇఓ సంజయ్ జాతో కెటిఆర్ భేటీ అయ్యారు. అలాగే సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ రాంశ్రీరంతోమంత్రి సమావేశమయ్యారు. సెప్టెంబర్‌లో టిహబ్ పరిశీలనకు హైదరాబాద్ వస్తానని శ్రీరాం హామీ ఇచ్చారు.