తెలంగాణ

మళ్లీ మహాకూటమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగం మరోసారి ఫలిస్తుందా?
ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్
టిడిపితో పొత్తు తెరాసకే మేలు
తెలంగాణలో రాజకీయ వడగాడ్పులు
వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయ సమీకరణలు

హైదరాబాద్, మే 25: ఎన్నికలకు రెండేళ్ల ముందే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, పాలకపక్షమైన టిఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొలేమని చేతులెత్తిసింది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో జతకట్టబోతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసినట్టు అయింది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని బీరాలు పలికిన తెలంగాణ పిసిసి ధీమా , పట్టుమని మూడు నెలలు అయినా గడవకముందే తాము ఒంటరిగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొలేమని చెప్పకనే చెప్పింది. అపార రాజకీయ అనుభవం, పరిణతి, వ్యూహారచనల్లో దిట్టగా పేరుగాంచిన జైపాల్‌రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం తమ వల్ల కాదన్న అంచనాకు రావడమంటేనే రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగిందనే సంకేతాన్ని ఇచ్చినట్టు అయింది. జైపాల్‌రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ శ్రేణుల మనస్థైర్యం దెబ్బతీసినట్టు అయిందని వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి ఆ పార్టీ సీనియర్ నేతలు వాపోతున్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపితో కలిసి పనిచేస్తామని జైపాల్‌రెడ్డి ఏ వ్యూహంతోప్రకటించారో కానీ అది మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనతను చెప్పకనే చెప్పినట్లయింది. అధికార పార్టీకి అయాచితంగా మేలు చేసినట్లయింది.
జైపాల్‌రెడ్డి వ్యూహం ఏదైనా ఆయన తన ప్రకటనతో టిఆర్‌ఎస్ నెత్తిన పాలు పోశారు. పొరుగు రాష్ట్రం ఏపిలో బిజెపితో జతకట్టిన టిడిపితో తెలంగాణలో కాంగ్రెస్ జతకట్టడమంటూ జరిగితే ఇక ఇక్కడ మైనార్టీల ఓటు బ్యాంక్ గంపగుత్తగా టిఆర్‌ఎస్ వైపు మళ్లడం ఖాయమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్థిగా టిఆర్‌ఎస్ భావిస్తుండగా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిస్తే ఇక్కడ అంతోఇంతో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌గా ఉన్న మైనార్టీలను శాశ్వతంగా దూరం చేసుకున్నట్టే అవుతుంది. పైగా మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కయ్యానికి కాలు దువ్వడం వంటి ఉదంతాలు మైనార్టీ వర్గాన్ని టిఆర్‌ఎస్‌కు మరింత దగ్గర చేశాయి. 2004ఎన్నికల తర్వాత అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దీంతో 2009 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగడంతో ప్రధాన ప్రతిపక్షం టిడిపి నేతృత్వంలో టిఆర్‌ఎస్‌తో సహా సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా బరిలోకి దిగినా కాంగ్రెస్‌ను గద్దె దింపలేక పోయాయి. అదే ప్రయోగాన్ని ఈ సారి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో టిడిపి, వామపక్ష పార్టీలు జతకట్టి మరోసారి మహాకూటమి ప్రయోగానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విభజనను చివరి దాకా వ్యతిరేకించిన టిడిపి, సిపిఎంలతో జతకడితే వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఇక ఏ నినాదం అవసరం లేకుండానే గెలుపు నల్లేరు మీద నడకగా సాగిపోతుందని రాజకీయ విశే్లషకుల అంచనా. తెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని సాధించి, అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్‌ఎస్‌కు తెలంగాణ వ్యతిరేక మహాకూటమిని మట్టి కరిపించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు జతకట్టి మహాకూటమిగా ఏర్పడితే ఈ కూటమి పరిస్థితి ఖేల్ ఖతం, దుకాణ్‌బంద్‌గా మారడమే అవుతుందని రాజకీయ విశే్లషకుల అంచనా. ఒకవైపు వడగాడ్పులతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుండగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన, హైదరాబాద్‌లో టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నాయుడి మినీ మహానాడు, త్వరలో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ పర్యటనల నేపథ్యంలో మారుతోన్న రాజకీయ సమీకరణలు రాజకీయ వడగాడ్పులను మరింత తీవ్రతరం చేశాయి.

వెల్జాల చంద్రశేఖర్