బిజినెస్

ఇక విమానాశ్రయాల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 25: రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ చేస్తారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సంస్థలు నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్స్‌లతోపాటు ఎయిర్‌పోర్టులలో కూడా తెలుగులో అనౌన్స్‌మెంట్లు ఉండాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ రాసిన లేఖకు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు స్పందించారు. దేశంలో అనేక భాషలు ఉన్నందున అన్ని భాషలలో క్రూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కష్టసాధ్యమని, అందువల్లనే డొమెస్టిక్ విమానాల్లో హిందీ, ఇంగ్లీషులలో మాత్రమే అనౌన్స్‌మెంట్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా స్వంతంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టులలో ఇక నుంచి హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణిలో సమ్మె సైరన్

జూన్ 15 నుంచి ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు
కొత్తగూడెం, మే 25: సింగరేణి కాలరీస్ కార్మికులు జూన్ 15 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద బొగ్గు పరిశ్రమ అయిన సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అమలు కోసం ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపిచ్చాయి. వారసత్వ ఉద్యోగాలపై గురువారం హైద్రాబాద్‌లో జాతీయ కార్మిక సంఘాల నాయకులకు, డిప్యూటీ లేబర్ కమిషనర్ (సెంట్రల్)కు చర్చలు విఫలం కావటంతో జాతీయ కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు సిద్ధమయ్యారు. వారసత్వ ఉద్యోగాలను అమలుచేయాలంటూ గత నెలలో సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో జరిగిన ఈ చర్చలు విఫలం కావటంతో సమ్మె అనివార్యమయింది. సింగరేణి యాజమాన్యం అటార్నీ జర్నల్ అభిప్రాయం కోసం నెల రోజుల గడువు కోరినప్పటికీ కార్మిక సంఘాలు తిరస్కరించి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అధ్యక్షుడు వై గట్టయ్య, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టియుసి) కార్యదర్శి జనక్‌ప్రసాద్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కార్యదర్శి మంద నర్సింహారావు, భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) నాయకుడు మాధవ్‌నాయక్, హెచ్‌ఎంఎంస్ కార్యదర్శి రియాజ్ అహ్మద్ చర్చల్లో పాల్గొన్నారు. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, సింగరేణి యాజమాన్యం నుంచి డైరెక్టర్ పవిత్రన్‌కుమార్ హాజరయ్యారు.