కృష్ణ

పొగ రహిత మండలంగా మోపిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, మే 25: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పొగ రహిత మండలంగా మోపిదేవిని రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ గురువారం ప్రకటించారు. మండల స్థాయిలో చివరి దశగా 17 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్‌లను అందచేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సంపూర్ణ పారిశుధ్య మండలంగా మోపిదేవి మండలం అభివృద్ధి చెందాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు నిర్మించటం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీటి కుంటల ఏర్పాటు వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం మహిళలకు దీపం కనెక్షన్‌లను అందచేశారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 400 మీటర్ల ట్రాక్ ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యం జయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి కె విద్యాసాగర్, ఎంపిడిఓ బిఎం లక్ష్మీకుమారి, తహశీల్దార్ జె విమల కుమారి, ఎంఇఓ కె రాజ్‌కుమార్, మండల టిడిపి అధ్యక్షుడు శీలం శ్రీరాములు, మార్కెట్ యార్డు అధ్యక్షుడు మండవ బాలవర్ధనరావు, స్థానిక మార్కెట్ యార్డు డైరెక్టర్ రావి నాగేశ్వరరావు, సర్పంచ్ పూర్ణచంద్రరావు, ఎంపిటిసిలు యక్కటి హనుమాన్ ప్రసాద్, రావి రత్నగిరిరావు, ఎస్‌ఇడబ్ల్యుఓ ఉపాధ్యక్షుడు, దివిసీమ రోటరీ క్లబ్ అధ్యక్షుడు రావి ప్రభుదాస్, గ్రామ కార్యదర్శులు, విఆర్‌ఓలు, సర్పంచులు పాల్గొన్నారు.

గ్రామాల సమగ్రాభివృద్ధే చంద్రబాబు లక్ష్యం
* ఉప సభాపతి బుద్ధప్రసాద్
నాగాయలంక, మే 25: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఏపి ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో దీపం పథకం కింద మహిళలకు రాయితీతో కూడిన గ్యాస్ కనెక్షన్‌ల అందచేత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కోడూరు మండలంలో 4,249 మంది గృహిణులకు గ్యాస్ కనెక్షన్‌లు అవసరం కాగా ఇప్పటికే 3,724 మందికి వీటిని అందజేశారని, మిగిలిన 525 మందికి ఇప్పుడు ఇచ్చి నాగాయలంకను పొగరహిత మండలంగా ప్రకటించామని ఆయన తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి, కోడూరు మండలాలు పొగరహితమయ్యాయని ఆయన ఇందుకు కృషి చేసిన అందరినీ అభినందించారు. పంట కుంటలు, వర్మి కంపోస్టు ఏర్పాటుకు ప్రజలు సహకరించాలన్నారు. గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు అందుతున్న దృష్ట్యా గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని బుద్ధప్రసాద్ కోరారు. మండలంలో తొమ్మిది శ్మశానాల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయన్నారు. కోడూరు, లింగారెడ్డిపాలెం ఉన్నత పాఠశాలల క్రీడా మైదానాల అభివృద్ధికి రూ.5లక్షల చొప్పున మంజూరైన విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాచర్ల భీమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీటిసి సభ్యుడు బండే శ్రీనివాసరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.447 కోట్లను వెచ్చించారన్నారు. ఈ సభలో ఎఎంసి చైర్మన్ మండవ బాలవర్ధిరావు, డిసి చైర్మన్ పాలేటి వెంకటేశ్వరరావు, కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రరావు, అవనిగడ్డ ప్రభుత్వ వైద్య ఏరియా వైద్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ మత్తి శ్రీనివాసరావు, సర్పంచ్ దాసరి విమల, డిఎల్‌పిఓ, మండల ప్రత్యేక అధికారి జె సత్యనారాయణ, తహశీల్దార్ ఎ అశ్వర్ధనారాయణరెడ్డి, ఎంపిడిఓ వి వెంకటేశ్వరరెడ్డి, ఎంఇఓ తుంగల రామదాసు, వెలుగు పథకం ఎపిఎం చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.