తెలంగాణ

ఆయనటు.. ఈయనిటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణలో చతికిలబడిన తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలబోతుంది. తెదేపా కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రమేశ్ రాథోడ్, ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఇద్దరూ త్వరలో పార్టీని వీడడానికి రంగం సిద్ధమైందని విశ్వనీయవర్గాల సమాచారం. రమేశ్ రాథోడ్ తెరాస గూటికి చేరబోతుంటే, ఆర్ కృష్ణయ్య కమలం గూటికి చేరనున్నారని ఈ వర్గాల సమాచారం. ఆర్ కృష్ణయ్య బిజెపిలో చేరడానికి ముహుర్తం ఇంకా ఖరారు కాకపోయినా రమేశ్ రాథోడ్ మాత్రం ఈనెల 29న సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాస కండువా కప్పుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. తెరాసలో తన చేరిక సందర్భంగా తెలంగాణ భవన్‌కు (హైదరాబాద్)కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివెళ్లడానికి రమేశ్ రాథోడ్ తన సొంత జిల్లా ఆదిలాబాద్‌లో బహిరంగంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. తెరాసలోకి తీసుకురావడానికి రమేశ్ రాథోడ్‌తో ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పలు దఫాలుగా చర్చించడమే కాకుండా, ఆయనతో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో స్వయంగా మాట్లాడించినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెదేపాకు భవిష్యత్ లేదని, అలాంటి పార్టీలో కొనసాగడం వృధా అని రమేశ్ రాథోడ్‌కు తెదేపా గూటి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన పలువురు సీనియర్ నేతలు నచ్చజెప్పిన తర్వాతనే పార్టీ మారడానికి సుముఖత వ్యక్తం చేసాకే సిఎంతో ఆయన చర్చించినట్టు తెలిసింది. రమేశ్ రాథోడ్‌తోపాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్, ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గం తెదేపా ఇంచార్జిగా ఉన్న వీరి కుమారుడు రితేశ్ రాథోడ్ తెరాసలో చేరనున్నారని తెలిసింది.
తెలంగాణలో తెదేపాకు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఆర్ కృష్ణయ్య కూడా పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్టు సమాచారం. బిజెపికి రాష్ట్రంలో బలమైన బిసి నాయకుడు లేకపోవడంతో కృష్ణయ్యను పార్టీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు మంతనాలు సాగించినట్టు సమాచారం. బిజెపి అధిష్టానం తరఫున కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి వారం కిందట కృష్ణయ్య ఇంటికి స్వయంగా వెళ్లడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. పైగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా ఆర్ కృష్ణయ్య ఆయనతో భేటీ కావడం, హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి, హైదరాబాద్‌లో జరిగిన తెదేపా మినీ మహానాడుకు గైర్హాజరు కావడానికి ఆయన పార్టీ మారే ప్రచారానికి మరింత ఊతమిస్తోంది.