తెలంగాణ

మద్దతుపై నిర్ణయం మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: రాష్టప్రతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకునే అధికారం తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌కు అప్పగిస్తూ పార్లమెంటరీ పార్టీ, శాసన సభాపక్షం సమావేశం తీర్మానం చేసింది. రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని తొలుత కెసిఆర్ భావించారు. అయితే అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా విమర్శలు చేయడం, దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఘాటుగా స్పందించటంతో రాష్టప్రతి ఎన్నికల్లో తెరాస ఎలాంటి వైఖరి అవలంభిస్తుందనే చర్చ సాగింది. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ, శాసన సభాపక్షం ఉమ్మడి సమావేశంలో ఈ అంశాన్ని సిఎం కెసిఆర్ ప్రస్తావించారు. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీ ఉంటుందో, ఏకగ్రీవంగా జరుగుతుందో, అభ్యర్థి ఎవరో ఇంకా తేలనప్పుడు, దీనిపై ముందే నిర్ణయం తీసుకోవడం ఎందుకని సిఎం కెసిఆర్ అభిప్రాయపడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షునిగా కెసిఆర్ ఏ నిర్ణయమైనా తీసుకునేలా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. లౌకికవాది అయితే మద్దతిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల సమావేశం ప్రకటించింది. అధికారపక్షం నుంచి రాష్టప్రతి అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారో చూసిన తరువాత స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకపోతే పోటీ అవకాశమే ఉండదని, అలాంటప్పుడు మద్దతు అంశంపై ముందే ప్రకటించాల్సిన అవసరం ఎందుకని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రాష్టప్రతి ఎన్నికల నాటికి పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈమేరకు కెసిఆర్‌కు అధికారం అప్పగిస్తూ తీర్మానం చేశారు.