తెలంగాణ

అన్ని పోస్టులను భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న అన్ని స్థాయిల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, వెటర్నరీ యూనివర్శిటీ విద్యార్థులు పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. 276 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు 2016 లోనే అనుమతించామని, టిఎస్‌పిఎస్‌సి ద్వారా నియామకాలు జరిగాయన్నారు. న్యాయపరమైన సమస్యల వల్ల ఈ పోస్టుల నియామకాల్లో జాప్యం జరిగిందని, టిఎస్‌పిఎస్‌సి ద్వారా 162 మంది అభ్యర్థులను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లుగా నియమించామన్నారు. మరో 542 పోస్టుల భర్తీకి 2017 జూన్ 2న నోటిఫికేషన్ జారీ అవుతుందని వివరించారు. పశుసంవర్ధక శాఖలో సేవల కోసం పదవీ విరమణ చేసిన 300 మంది సేవలను కాంట్రాక్ట్‌విధానంలో వినియోగించుకుంటున్నామన్నారు. రైతుల చెంతకే పశువైద్య సేవలు అందించేందుకు వీలుగా 100 సంచార వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్టు తలసాని తెలిపారు. ఒక సంచారవాహనాన్ని సచివాలయంలో శనివారం ఆయన పరిశీలించారు. ఒక్కో వాహనాన్ని 14.65 లక్షల రూపాయలతో కొనుగోలు చేశామన్నారు. రైతులు అత్యవసర పరిస్థితిలో 1962 నెంబర్‌కు ఫోన్ చేస్తే సంచార వాహనం రైతు ఇంటికి వస్తుందని వివరించారు.
మొదటి దశలో 42 లక్షల గొర్రెల పంపిణీ
గొర్రెల పంపిణీ పథకం తొలిదశలో 42 లక్షల గొర్రెలను వచ్చే నెలలో పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. గొర్రెలకు గ్రాసం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి శాఖాపరంగా అన్ని స్థాయిల సిబ్బంది సహకారం అవసరమని పేర్కొన్నారు.
100 సంచార పశు వైద్యశాలల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల వెంటే ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఏడాది 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో సంచార పశు వైద్యశాలల ఏర్పాటుకు 100 వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో వాహనాన్ని రూ.14,65,000 వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన ప్రొటో టైప్ వాహనాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంచార పశు వైద్యశాలలో నిపుణుడైన పశు వైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, హెల్పర్, డ్రైవర్‌తో పాటు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. గొర్రెల పెంపకందారులుగాని పశు పోషకులుగాని అత్యవసర పరిస్థితుల్లో సంచార వైద్యశాలల సేవలు పొందడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1962ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.
chitram...
హైదరాబాద్‌లో శనివారం ప్రొటో టైప్ వాహనాన్ని పరిశీలిస్తున్న మంత్రి తలసాని