తెలంగాణ

ఎస్‌పిఆర్‌ఇఇ పథకం కింద 5.64 లక్షల ఉద్యోగులకు లబ్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: తెలంగాణలో ఎస్‌పిఆర్‌ఇఇ పథకం (స్కీం టు ప్రమోట్ రిజిష్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్/ఎంప్లాయిస్) కింద ఈ ఏడాది మే 15 నాటికి 5.64 లక్షల మంది లబ్దిపొందారని కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసి) హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకుడు అరుణ్ పాండే తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 44,468 మంది భవన నిర్మాణ శ్రామికులను ఈ పథకంలో చేర్చుకున్నామన్నారు. కార్మిక రాజ్య బీమా సంస్థ ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, నూతన కార్యక్రమాల గురించి శనివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో వివరించారు. మహిళా ఉద్యోగినులకు 2017 జనవరి 20వ తేదీ నుంచి ప్రసూతి సెలవును 12 నుంచి 26 వారాలకు పెంచామని, అలాగే కాంట్రిబ్యూషన్ చెల్లింపునకు అర్హత పరిమితిని 3 ఏళ్ల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించామని ఆయన తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో ఈఎస్‌ఐసి మోడల్ డిస్పెన్సరీ/డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఈ ఏడాది జనవరి 9న ప్రారంభించామని, ఒక ఇన్సూర్డ్ పర్సన్ (ఐపి) ఫ్యామిలీ యూనిట్‌కు గాను ప్రతి ఏడాది ఇచ్చే రూ.2150 వైద్య ఖర్చుల గరిష్ట పరిమితిని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.3 వేలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. 40 ఏళ్లు దాటిన వారికి ఏటా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయంచుకునే సదుపాయం కల్పించామన్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది మార్చి నుంచి మొబైల్ డిస్పెన్సరీలను ప్రారంభించినట్లు చెప్పారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసి వైద్య కళాశాలలో 50 శాతం సీట్లను బీమా చేయించుకున్న వ్యక్తుల పిల్లలకు రూ.24 వేల వార్షిక రుసుముపై కేటాయించామని, ఈ రకంగా గత విద్యా సంవత్సరంలో 48 మందికి ప్రవేశాలు కల్పించామని చెప్పారు.