బిజినెస్

శ్రీసిటిలో వైటల్ పేపర్ ప్యాకేజింగ్ మూడో యూనిట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, మే 27: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో గల శ్రీసిటి పారిశ్రామిక వాడలో వైటల్ పేపర్ ప్యాకేజింగ్ పరిశ్రమ శనివారం తమ మూడో యూనిట్ నుండి ఉత్పత్తులను ప్రారంభించింది. సింగపూర్‌కు చెందిన ఈ పరిశ్రమ ఇప్పటికే శ్రీసిటిలో రెండు యూనిట్‌లను కలిగి ఉంది. వీటిలో ఆఫీస్, స్కూల్ స్టేషనరి, ఇతర పేపరు ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తారు. కొత్తగా ఏర్పడిన మూడో యూనిట్‌లో కొరిగేటేడ్ ప్యాకేజి మెటీరియల్‌ను తయారు చేయనున్నారు. కాగా, నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శశి రవడ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైటల్ పేపర్ ప్యాకేజింగ్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ప్రదీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ మంచి నాణ్యతతో పాటు పోటీ ధరకే తమ ప్యాకేజింగ్ ఉత్పత్తులను అందించడం ద్వారా శ్రీసిటిలో ఉన్న అనువైన పరిశ్రమలకు తాము భాగస్వాములుగా మారతామన్నారు. దేశంలోనే ప్రథమంగా ఇక్కడ అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

చిత్రం... శ్రీసిటీలోని వైటల్ పేపర్
ప్యాకేజింగ్ పరిశ్రమ యూనిట్