హైదరాబాద్

1969 విద్యార్థి ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, మే 27: విద్యార్థి జెఎసి 1969లో జరిపిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జై తెలంగాణ విద్యార్థి నేతల ఉద్యమ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఓ చరిత్ర ఉందని. ఆ చరిత్ర ఆధారంగానే తెలంగాణ సిద్ధించిందన్నారు. కేసిఆర్ ఉద్యమ దక్షత, విద్యార్థి ఉద్యమాలతో 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారం అయిందని పేర్కొన్నారు. ఆనాటి ఉద్యమ విద్యార్థి నాయకుల జెఎసి నేతల సేవలను తెలంగాణ ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందన్నారు. వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థి జెఎసికుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే ఉన్నారని చెప్పారు. తెలంగాణ యువకులకు ఉద్యోగాల్లో అన్యాయం జరగకుండా 610 జీఓను తీసుకువచ్చినా అది సక్రమంగా అమలు కాకపోవడంతో వేలాది మంది ఆంధ్ర ప్రాంతం వారు అక్రమంగా ఇక్కడ ఉద్యోగాలు పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు నిధుల్లో, నీటి వినియోగంలో తీవ్ర వివక్షతకు గురౌతుండటంతో ప్రజా ఆగ్రహం మొదలైందని చెప్పారు. యావత్ ప్రజానికం తమకు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని భావించి ఉద్యమాల్లో పాల్గొని స్వారాష్ట్రాన్ని సాధించుకున్నారని చెప్పారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి వినోద్, నిర్వాకులు ఎస్.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.