కృష్ణ

గాలివాన బీభత్సానికి కూలిన చెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మే 27: గాలివాన బీభత్సానికి చెట్లు కూలిపోయాయి. జి.కొండూరు మండలంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సాధారణ జన జీవితాన్ని స్తంభింప చేసింది. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకూ వర్షం కురిసింది. ఎండవేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. ఈదురు గాలుల ధాటికి జి.కొండూరు - ఆత్కూరు రహదారిలో తుమ్మచెట్లు మధ్యకు విరిగి కూలిపోయాయి. రోడ్డుపై చెట్లు పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వెలగలేరులో ఒక ఇంటిపై భారీ వృక్షం విరిగి పడింది. దీంతో ఇల్లు ధ్వంసం అయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ శాఖ అధికారులు మరమత్తులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

మనందరి మతం మానవతే..
విజయవాడ, మే 27: మతాలకు అతీతంగా యువకులు సోదర భావంతో ముందుకెళ్లాలని, మతాలు వేరైనా మన మాతృభూమి ఒక్కటే, మన భాషలు వేరైనా దేశం పట్ల మన బాధ్యత ఒక్కటే, నివసించే ప్రాంతాలు ఎనైనా మనందరి లక్ష్యం ఒక్కటేనని యూత్ వెల్ఫేర్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా స్థానిక యూత్ వెల్ఫేర్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ మాసానికి కుల మతాలకు అతీతంగా యూత్ వెల్ఫేర్ సభ్యులు స్వాగతం తెలిపారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా అంచలంచెలుగా అభివృద్ధి సాధిస్తామని, కష్టాలు ఎదురైనా కడ వరకూ కలిసుంటామని, ఆపదల అంతానికై మనమంతా ముందుండాలని షుబ్లీ పిలుపిచ్చారు. సంస్థ గౌరవ కార్యదర్శి హర్‌మొహిందర్ సింగ్ సహానీ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం గురుద్వారాలో సిక్కు సోదరుల తరపున ఇఫ్తార్ విందు యూత్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులు తమ ఆహ్వానాన్ని మన్నించి గురుద్వారాలో ఇఫ్తార్ విందును స్వీకరించాలని కోరారు. యూత్ వెల్ఫేర్ సభ్యులు బాబురావు మాట్లాడుతూ మానవత్వం కనుమరుగైపోతున్న దశలో సమాజంలో యూత్ వెల్ఫేర్ మానవత్వాన్ని చాటిచెబుతూ తమ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తుండటం అభినందనీయమన్నారు. రంజాన్ నెలలో ఒకరోజు క్రైస్తవ సోదరులు తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రహీం, అమానుల్లా, గంగాధర్, వంశీ, రియాజ్, జర్నలిస్టు అలీం పాల్గొన్నారు.