కృష్ణ

కల్తీ నెయ్యి గుట్టురట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 27: కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న కల్తీ నెయ్యి పరిశ్రమపై టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. భారీగా కల్తీ నెయ్యి తయారు చేస్తూ అక్రమంగా ప్యాకింగ్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలోని మధురానగర్, పసుపుతోట, నాలుగవ లైన్‌లో ఈ పరిశ్రమ నడుస్తోంది. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఎసిపి పి మురళీధర్ నేతృత్వంలో సిఐ సురేష్‌రెడ్డి ఆధ్వర్యాన సిబ్బంది శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో కల్తీ నెయ్య దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. 25 కేజీల నెయ్యి అదికూడా కల్తీ పదార్థాలతో తయారుచేసిన సరుకుగా నిర్ధరించారు. దీనిలో 105 కేజీల పామాయిల్ కలిపి తయారు చేసిన నెయ్యిని పెద్దపెద్ద డబ్బాలలో నింపారు. ఈ డబ్బాల నుంచి నెయ్యిని వివిధ రకాల పరిమాణాల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్‌లో విక్రయాలు సాగిస్తున్నారు. కల్తీ దందాకు పాల్పడుతున్న కర్ణాటి పుల్లారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీ, ప్యాకింగ్ యూనిట్‌కు సంబంధించి నాలుగు మిషన్లను సీజ్ చేశారు. ఈ యూనిట్ నుంచి 100 కేజీల ప్యాకింగ్ కవర్లు, ఒక మోటార్ బైక్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితునితో సహా స్వాధీనం చేసుకున్న సామగ్రిని సత్యనారాయణపురం పోలీసులకు అప్పగించారు. మొత్తం కల్తీ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగాల పేరిట మోసం కేసు..
తెరవెనుక పెద్దల
అరెస్ట్‌కు రంగం సిద్ధం!
* ఇద్దరిని విచారించిన వన్‌టౌన్ సిఐ కాశీవిశ్వనాథ్
పాతబస్తీ, మే 27: దుర్గగుడిలో ఉద్యోగాలు వేయస్తామని మోసం చేసిన కేసులో పెద్ద తిమింగలాలే తెరవెనుక ఉన్నాయని, వారి అరెస్టులు త్వరలో జరుగుతాయని దర్యాప్తు అధికారి దాసరి కాశీవిశ్వనాథ్ అన్నారు. నిరుద్యోగులను మోసగించి నకిలీ అపాయింట్‌మెంట్స్ లెటర్‌లు, నకిలీ ఐడి కార్డులు జారీ చేసిన కేసులో ఇద్దరు నిందితులు వీరాస్వామి, వరప్రసాద్ ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే. కాగా ప్రధాన నిందితులకు సహకరించిన అధికారులకు ఈ కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. శనివారం సాయంత్రం ఇద్దరిని సిఐ విచారించారు. విచారణలో వారు పలు అంశాలు బయటపెట్టారు. ఈ కేసులో గొలుసుకట్టు నిందితులు ఒక్కక్కరూ బయటపడుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా నిందితులు ఎంతటివారైనా జైలుకు పంపించి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని ప్రక్షాళన చేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. పైగా బెజవాడ అమ్మవారంటే వన్‌టౌన్ పోలీసులు ఆడపడుచుగా భావించి ఉత్సవాల్లో దసరా మహోత్సవాల్లో అమ్మవారికి పట్టుచీర సమర్పిస్తుంటారు. ఈ విచారణలో తమ విచారణకు మకిలి అంటకుండా స్వచ్ఛందంగా బాధితులకు న్యాయం చేయాలని భావించి విచారణ చేపట్టినట్టుగా పోలీసులు చెపుతున్నారు.