భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంగిరాల వెంకట సూర్యప్రకాశరావు, వరంగల్ (తెలంగాణ)
ప్ర:శర్మగారూ! మన దేశంలో ఈ అనైక్యతా భావాలు ఎందుకున్నాయి? ఎప్పుడు బాగుపడుతుంది? దేశం పరంగా అడుగుతున్నాను.
సమా:మన దేశం మొదటి నుండి జ్ఞానభూమి. స్వతంత్రమైన ఆలోచనల కారణంగా- విభిన్న దృక్పథాలు- సిద్ధాంతాలూ ఏర్పడ్డాయి. అయితే జ్ఞానం యొక్క మరో పార్శ్వం ‘సైడ్ ఎఫెక్ట్స్’ భావ సంఘర్షణలు- అనైక్యత- ఇక రెండవ కారణం వ్యక్తిగత మహత్వాకాంక్షలు- అసూయాద్వేషాలు- వారసత్వ మమకారాలు- మొదటినుండి బ్రాహ్మణ క్షత్రియులదే ఆధిపత్యం. రాజులకు రాజ్య బలాధిక్య మహత్వాకాంక్ష- బ్రాహ్మణులకు ‘విద్యా వివాదాయ’ అన్నట్టుగా పాండిత్య- తపోబల మహత్వాకాంక్షల పోరాటం. విశ్వామిత్ర వశిష్ఠులు- హైహయ వంశం పరుశురాముడు ద్రుపద ద్రోణులు- ఉదాహరణలు- వీరిమధ్య సామాన్య జనం సమాజం గుర్తింపు లేకుండాపోయింది. మహత్వాకాంక్షలే భయంకరమైన అసూయలుగా మారి అనైక్యతకూ, పరాయికారి ఆక్రమణలకూ దారితీసింది. ఇప్పటికైనా చరిత్ర తెలిసి యువతరం మారాలి. క్రికెట్ స్టార్లపట్ల- సినీ స్టార్ల పట్ల- నీలి వ్యామోహాభిమానాలు- కార్గిల్ వీరులపట్ల, కాశ్మీర్ బలిదానాలపట్ల చూపగలగాలి- సినీ - కళా- సాహిత్య వ్యాపార రంగా లు తమ బాధ్యతను గుర్తించాలి. రాజకీయ నాయకులు ఇజాలు కాక నిజాలు చూడాలి. స్వామిభక్తి బానిస భావాలు మాని దేశభక్తి భావాలు పెంచుకోవాలి. వారసత్వాధికారాల మమకారాలనుండి నిజమైన ప్రజాస్వామ్యం వైపు పయనించాలి. అప్పుడు మన దేశం ప్రపంచంలోనే మహోన్నతం అవుతుంది.
వై.రాధామాధవ్ - విరూపాక్షినగర్ (అనంతపురం)
ప్ర:అయ్యా! మా ఆదాయ వివాదంలో అక్షరాలా మీరు చెప్పినట్లుగా నాకు అనుకూలంగానే నిర్ణయం జరిగింది. మీరు చెప్పినట్లుగా మూడులో ఒక వంతు నాకు నిర్ణయించారు. ఒప్పుకోమంటారా?
సమా:ఒప్పుకోండి. వివాదాన్ని పెంచుకోవటం వలన నష్టమే కానీ లాభం లేదు. మీ యోగంలో ఉన్నదే నేను చెప్పాను. శుభం భవతు.
డి.మహేశ్, కామారెడ్డి (తెలంగాణ)
ప్ర:గురువుగారూ! నమస్కారం! గతంలో మీరు చెప్పినట్లుగానే ‘మే’నెల నుండి నా వివాహ ప్రయత్నాలలో శుభసూచనలు కనబడుతున్నాయి. రెండు సంబంధాలలో ఒకటి రైల్వే ఉద్యోగిని- మరొకటి ఉద్యోగం లేనిది. దేనిని ఒప్పుకోమంటారు?
సమా:దక్షిణ ఆగ్నేయాల నుండి వచ్చిన సంబంధం- ఎమ్- ఎన్- బి - వి- ఆర్ అనే అక్షరాలు గలవాళ్ళతో మీ వివాహం నిశ్చయమవుతుంది. ఊరి పేర్లు కూడా అవే ఉంటాయి.
ఎన్.సి.వి.రామానుజం- రాజమండ్రి (తూ.గో.జిల్లా)
ప్ర:రావలసిన ఆస్తి పరుల పాలైంది. వృత్తిలో ఎదుగుదల లేదు? ఆర్థికంగా బాధలు? పరిష్కారం చెప్పండి.
సమా:మీ జాతకంలో చంద్రదోషం- కుజదోషాలు ఉన్నాయి. దాని పరిష్కార శాంతికోసం వ్యక్తిగతంగా వ్రాయండి. తెలుపగలను.
నాగేశ్వరరావు, రాజమండ్రి, (తూ.గో.జిల్లా)
ప్ర:తమ్ముడు 20 సంవత్సరాల క్రితం ఇల్లు విడిచిపోయాడు. రెండవ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు గుండె సర్జరీ జరిగింది. మానసిక వ్యాకులత- సంఘంలో పరపతి అంతంత మాత్రమే. పరిష్కారం చెప్పండి.
సమా:ఏదో ఒక అభిశాపం మిమ్మల్ని వెంటాడుతోంది. నాగదోషం కాని- శ్రాద్ధకర్మలు సరిగా జరపని దోషం కాని ఉండి ఉండాలి. సశాస్ర్తియంగా నాగప్రతిష్ఠ చేయండి. మంత్రాలయంలో పితృ మేధా పారాయణ, శాంతి శ్రాద్ధం జరిపించండి. దోషాలు పరిహారమవుతాయి, శుభాలు జరుగుతాయి. ఇంకా వివరాలు కావలిస్తే వ్యక్తిగతంగా కలవండి.
పుట్రేవు శ్యామల, మల్లికార్జుననగర్, సికింద్రాబాద్
ప్ర:నా కుమారుని వివాహం ఎప్పుడౌతుంది?
సమా:సంఖ్య మీ కుమారుడు చెప్పాలి, మీరు కాదు.
వి.ఎస్.ఎల్.ఎన్.పట్నాయక్- శ్రీకాకుళం (ఆంధ్ర)
ప్ర:సంతాన ఫలం ఏ వయసులో జరుగును.
సమా:సంతాన విషయంలో దంపతుల ఇరువురి జాతకాలు పరిశీలించాలి. ఒక్కరిది కాదు.
చిట్టిప్రగడ సుబ్రహ్మణ్యం -కోరుకొండ (తూ.గో)
ప్ర:ఋణపీడ - పరిష్కారమేమిటి?
సమా:సులభమార్గం ఋణవిమోచన అంగారక వ్రతం- కొంచెం ఖర్చుతో కూడినది. ఋణవిమోచన పాశుపత రుద్రాభిషేకం- మీ అనుకూలం ప్రకారం నిర్వహించి ఆ తరువాత ధనాకర్షక కుబేర యంత్రం పూజలో పెట్టుకోండి. ధన సంపత్తికి లోటుండదు.
కె.సత్యవతి, బీరంగూడ (హైదరాబాద్)
ప్ర:కుమారుని ఉద్యోగంలో పని ఒత్తిడి- వేరొక కంపెనీలో ప్రయత్నం ఫలిస్తుందా?
సమా:ప్రస్తుతం శని వక్రించిన కారణంగా మీ అబ్బాయికి అర్థాష్టమంలోకి వచ్చాడు ఆగస్ట్ వరకు యధాస్థితిలోనే ఉండండి.
మల్లాది వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ, కాకినాడ (తూ.గో)
ప్ర:నలభై సంవత్సరాలుగా చర్మ రోగంతో బాధపడుతున్నాను. పరిష్కారం చెప్పండి.
సమా:పైపూతగా వేపనూనె పూయండి. గంట తరువాత నలుగుపిండితో స్నానం చేయండి. హోమియోలో ‘నేట్రంసల్ఫ్ 6 ఎక్స్’ జర్మనీ ప్రోడక్ట్ డాక్టర్ సలహాతో వాడండి.
కె.వి.శ్రీనివాసరావు, గుంటూరు (ఆంధ్ర)
ప్ర:వివాహయోగం ఎప్పుడు?
సమా:మీరు చెప్పిన సంఖ్యలో కృత్రిమత్వం కనబడుతోంది. ముందుగానే ప్రిపేర్ అయి చెప్పినట్టుగా తెలుస్తోంది. యాదృచ్ఛికంగా చెపితేనే దైవికం- ఏమైనా మీకు ఆగస్ట్‌లో శుభసూచనలున్నాయి.
సి.లక్ష్మీప్రసన్న, శ్రీకాకుళం (ఆంధ్ర)
ప్ర:నాకు బాంకింగ్- ఇన్సూరెన్స్ శాఖల్లో ఉద్యోగం రాగలదా?
సమా:ఆలస్యంగా ఇన్సూరెన్స్ శాఖలో మెడికల్ వింగ్‌లో వచ్చే అవకాశం ఉంది.
ఎమ్.సుబ్రహ్మణ్య శర్మ- విజయవాడ (కృష్ణా)
ప్ర:వివాహయోగం ఎప్పుడు? ఆలస్యానికి కారణం ఏమిటి?
సమా:మీలోని అనిశ్చిత స్థితి- ఏదో ఒక మానసిక సంకోచం- కొందరి స్ర్తిల ప్రభావం మీ వివాహానికి ఆలస్యం (కుటుంబంలోని వారే) 2018లో అవకాశాలున్నాయి.
ఆకులూరు వెంకట సుబ్బారావు, పొదలకూరు (నెల్లూరు)
ప్ర:మాది ఫ్యాన్సీ షాపు- ఎంత చేసినా మిగులు కనబడదు. అప్పు చేయాల్సి వస్తోంది. ఎందుకోమరి?
సమా:షాపు వాస్తు సరిచూసుకోండి. ధనాకర్షక కుబేర యంత్రం (వ్యాపార సంబంధం- యక్షిణీ సంబంధం) పెట్టుకొని పూజించండి.
శివశ్యామల - విజయవాడ (కృష్ణా)
ప్ర:మూడు సంవత్సరాల క్రితం మా సమస్యలు చెపితే గృహ వాస్తుదోషం అన్నారు. అక్షరాలా అది నిజమే. కాని మేము ఇల్లు మారలేకపోతున్నాము. మార్గం చెప్పండి.
సమా:ఇంట్లో శ్రీవేంకటేశ్వర స్వామి ముందు నలభై రోజులు అఖండంగా నేతి దీపారాధన చేసి- కొంచెం కోవా నైవేద్యం పెట్టండి. నలభై రోజులు దీపం అఖండంగా వెలగాలి. తప్పక మార్పు వస్తుంది.
కె.పాపారావు, వైజాగ్ (ఆంధ్ర)
ప్ర:స్వంత ఇంటి యోగం?
సమా:మీకా స్థోమత ఉంది. నిర్ణయంలోనే లోపం ఉంది.
కె.్ఛయ - దొరసానిపాడు (ఆంధ్ర)
ప్ర:మెడికల్ రంగం - ఇంజనీరింగ్ రంగాలలో ఏది నాకు యోగిస్తుంది.
సమా:ఇంజనీరింగ్ రంగం బాగుంటుంది.
జంపాల మహేశ్ చంద్ర- విజయవాడ (కృష్ణా)
ప్ర:శర్మగారూ! నాదొక ప్రశ్న- సంఖ్య- ఐదు-
సమా:మీ మనసులో నా పట్ల తిరస్కార భావం ఉంది. నన్ను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో ఆ ప్రశ్న వేసావు. అయినా సరే, కొద్దిరోజుల్లోనే నీవు స్థిరాస్తి వివాద సమస్యను ఎదుర్కొంటావు.
ఎస్.మధు, బాదేపల్లి (మహబూబ్‌నగర్)
ప్ర:వివాహ యోగం ఎప్పుడు? వృత్తి వ్యాపారం బాగుంటుందా? ఉద్యోగమా?
సమా:ఆగస్ట్‌లో వివాహ యోగం- వ్యాపారమే మీకు యోగిస్తుంది. ముఖ్యంగా ధాన్యం కాని- పూజా ద్రవ్యాల వ్యాపారం కాని యోగిస్తుంది.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ