ఆంధ్రప్రదేశ్‌

టార్గెట్ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానాడు వేదికగా టి.సర్కార్‌పై విమర్శలు

కెసిఆర్ వైఫల్యాలను ఎండగట్టిన టిటిడిపి నేతలు ఆచితూచి స్పందించిన ఏపి ముఖ్యమంత్రి
తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా కార్యకర్తలకు దగ్గరవుతానని హామీ

విశాఖపట్నం, మే 28: ఏపిలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు తెలంగాణ అధికార పగ్గాలను చేపట్టడానికి పావులు కదుపుతోంది. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న నిరసనలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ మహానాడును వేదికగా చేసుకున్నట్టు ఆదివారం టిటిడిపి నేతల ప్రసంగాలను బట్టి అవగతమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదని టిఆర్‌ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు దీటైన సమాధానం ఇవ్వడంతో పాటు, టిటిడిపి నేతల్లో నైరాశ్యాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని నింపాలన్న లక్ష్యంగా తను మాట్లాడకుండానే, తెలంగాణ నేతలతో మాట్లాడించి, చంద్రబాబు తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహానాడును వేదికగా చేసుకుని కేసిఆర్‌పై నేరుగానే బాణాలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి అయిన కెసిఆర్ పాలనా వైఫల్యాలు, తెలంగాణ ప్రజలకు ఆయన చేస్తున్న అన్యాయం, తెలంగాణ ఉద్యమ నేతల అణచివేతపై టిటిడిపి నేతలు చేసిన ప్రసంగాలు తెలంగాణ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని ఇవ్వడంతోపాటు, కేసిఆర్ ప్రభుత్వంపై ఏపి ప్రజల్లో ఉన్న భ్రమలను తొలగించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌గౌడ్, నర్సిరెడ్డి తదితరులతో తెలంగాణకు సంబంధించిన వివిధ తీర్మానాలపై మాట్లాడించారు. రాష్ట్ర విభజన తరువాత మిగులు బడ్జెట్‌తో తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడితే, 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో ఏపిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. నిధులకు కొరత లేకపోయినా, కెసిఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు కాలేదని, లోటు బడ్జెట్ ఉన్నా, తాను సంక్షేమ కార్యక్రమాలను జయప్రదంగా అమలు చేస్తున్నానని టిటిడిపి నేతలతో చెప్పించడంలో బాబు సక్సెస్ అయ్యారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందన్న విషయాన్ని పదే పదే టిటిడిపి నేతలు తమ ప్రసంగాల్లో చెప్పారు. ఏపిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారు విశే్లషణాత్మకంగా సభకు వివరించడం గమనార్హం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోవడం వలన తాము అనాధలమైపోయామని, ఏపి నేతలు చంద్రబాబు వంటి నాయకుడిని వదులుకోవద్దంటూ వారు ప్రసంగించడం గమనార్హం. 2019 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాకపోతే, నష్టపోతామన్న విషయాన్ని సమావేశానికి వచ్చిన టిటిడిపి శ్రేణులకు తెలంగాణ నేతలు సంకేతాలు పంపించారు. కేసిఆర్ పాలన మెరుగ్గా ఉందని ఏపిలో కొంతమంది భావిస్తున్నారని, అయితే, వారు తెలంగాణ వచ్చి చూస్తే, అక్కడ జరుగుతున్న అన్యాయాలు తెలుస్తాయని వారు చెప్పుకొచ్చారు.
ఈ మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించినప్పుడు చంద్రబాబు అనర్గళంగా ప్రసంగించారు. అయితే, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలపై చంద్రబాబు ఆచి తూచి మాట్లాడారు.. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి చేస్తున్న పోరాటాలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. మహానాడుకు హాజరైన తెలంగాణా టిడిపి కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తోంటే తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వారిలో కన్పిస్తోందన్నారు. కొంతకాలంగా తెలంగాణలో పార్టీ కార్యకర్తలకు కాస్త దూరమయ్యానన్న ఆవేదన అనుభవిస్తున్నానని అన్నారు. మహానాడు సందర్భంగా వారిని దగ్గరగా చూస్తే ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. తెలంగాణా కార్యకర్తల్లో ఒక పట్టుదల, కసి స్పష్టంగా కన్పిస్తోందన్నారు. టిడిపి జెండాతోనే తిరిగి తెలంగాణాలో అధికారంలోకి వస్తామన్న ధీమా వారి భావాల్లో వ్యక్తమవుతోందన్నారు. ఇక మీదట తెలంగాణాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, వారికి సమయం కేటాయించి, సాధకబాధకాలు వింటానని సభా ముఖంగా హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ మహానాడు తరువాత చంద్రబాబు తెలంగాణపై మరింత దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మహానాడులో ఏపి నాయకుల కన్నా, తెలంగాణ నాయకులకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్నిబట్టి చూస్తే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి జెండాను ఎగరేయాలన్నదే చంద్రబాబు టార్గెట్‌ని ఖాయంగా చెప్పచ్చు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కెసిఆర్‌ను తెలంగాణలో బలంగా ఢీకొంటున్న రేవంత్‌రెడ్డిని ఈ రెండు రోజుల్లో మాట్లాడనీయలేదు. కేవలం ఆయన ప్రసంగం కోసమే టిటిడిపి శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. మరి చివరి రోజు రేవంత్ రెడ్డి కెసిఆర్‌పై విమర్శలు గుప్పిస్తారా? లేక వ్యూహాత్మక వౌనాన్ని పాటిస్తారా? అన్నది వేచి చూడాలి.

చిత్రం... విశాఖపట్నంలో మహానాడు వేదికపై పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తున్న అధినేత చంద్రబాబు