తెలంగాణ

మిగులువైపు తెలంగాణ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో కష్టాల నుంచి గట్టెక్కింది. విద్యుత్ కోతల నుంచి మిగులువైపు పరుగులు తీస్తోంది. మూడేళ్ల క్రితం ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి స్వయం సమృద్ధిసాధించి, వచ్చే మూడేళ్లలో కరెంట్‌ను అమ్ముకునే స్థితికి చేరుతోంది. సిఎం కెసిఆర్ విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను అందించింది.రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ విద్యుత్ సంక్షోభంలో పడిపోతుందని, ప్రజలు కటిక చీకట్లో కాలం గడపాల్సి వస్తుందని 2014కంటే ముందు అప్పటి పాలకులు ప్రకటనలు చేశారు. దాంతో అప్పట్లో అందరిలోనూ ఆందోళన నెలకొంది. రాష్ట్ర విభజన జరిగినా విద్యుదుత్పత్తిలో తెలంగాణ స్వయంసమృద్ధి సాధిస్తుందని నిపుణులు వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కెసిఆర్ యుద్ధప్రాతిపదికన తీసుకున్న చర్యలతో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి విద్యుత్ అందుబాటు- డిమాండ్ పరిశీలిస్తే 2,700 మెగావాట్ల లోటు ఉండేది. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో 2000 మెగావాట్ల విద్యుత్ ఈ రంగాలకే అవసరం ఉండేది. తెలంగాణలో వ్యవసాయ పంప్‌సెట్లు 25 లక్షలు ఉండటంతో దీనికి 2500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండేది. రాష్ట్ర విభజన సమయానికి బొగ్గులేని ఆంధ్ర (విజయవాడ, కడపలలో)లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టారు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న తెలంగాణలో థర్మల్ కేంద్రాల స్థాపన సరిగ్గా జరగలేదు. ఈ కారణంగానే విభజన సమయంలో రూపొందించిన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో జరిగే విద్యుదుత్పత్తిలో 47 శాతం ఏపీ, 53 శాతం తెలంగాణ వాడుకోవాలని నిబంధన విధించారు. విభజన తర్వాత ఏపీ వివిధ కారణాలు చూపెడుతూ, తెలంగాణకు విద్యుత్ ఇవ్వకపోవడంతో కష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
ఈ పరిస్థితిలో సిఎం కెసిఆర్ కీలకమైన మార్పులు చేస్తూ, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పథకాలు (త్రిముఖవ్యూహం) రూపొందించి అమలు చేశారు. తొలుత ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు తెలంగాణలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఐఏఎస్ అధికారుల స్థానంలో విద్యుత్ రంగంలో అనుభవం ఉన్నవారిని నియమించారు. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు విద్యుత్ రంగంలో 40 ఏళ్ల అనుభవం దేవులపల్లి ప్రభాకర్‌రావును చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. తొలుత విద్యుత్ పంపిణీలో జరిగే నష్టాలను 16.83 శాతం నుండి 15.98 శాతానికి తగ్గించారు. త్రిముఖ వ్యూహంలో తొలిభాగంగా స్వల్పకాలిక చర్యలు చేపట్టి, అందుబాటులో ఉన్న విద్యుత్తు కొనుగోలు చేసి అవసరాలు తీర్చారు. తెలంగాణకు కొంతకాలం విద్యుత్‌ను ఇవ్వగలిగే సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మధ్యకాలిక అవసరాలు తీర్చారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 29 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలన్న లక్ష్యాన్ని ముందుపెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా 2014 నుండి ఇప్పటి వరకు 22 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండి కేటాయించారు. 2014 జూన్ నాటికి 6575 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న తెలంగాణలో 2017 మే నాటికి 10,765 మెగావాట్లకు ఉత్పత్తి పెరిగింది. 2017 డిసెంబర్ చివరి వరకు ఈ సామర్థ్యం 14,895 మెగావాట్లకు పెరగబోతోంది. భూపాలపల్లి, జైపూర్ థర్మల్ ప్లాంట్ల నుంచి 1800 మెగావాట్లు, సిజిఎస్ నుండి 178, థర్మల్ పవర్‌టెక్ ద్వారా 570 మెగావాట్లు, జూరాల హైడ్రో నుండి 240, పులిచింతల నుండి 30 మెగావాట్లు, సోలార్ నుండి 1274 మెగావాట్లు, పవన విద్యుత్ 99 మెగావాట్లు ఈ మూడేళ్లలో అదనంగా చేకూరింది. దీనికితోడుగా పాల్వంచ నుండి 800 మెగావాట్లు, చత్తీస్‌గఢ్ నుంచి వెయ్య మెగావాట్లు, భద్రాద్రి నుండి 1080 మెగావాట్లు, పులిచింతల నుండి 90 మెగావాట్లు, సిజిఎస్ నుండి 206 మెగావాట్లు, సోలార్ ద్వారా 954 మెగావాట్లు ఈ ఏడాది చివరి వరకు లభించబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2017 డిసెంబర్ నాటికి విద్యుత్ సామర్థ్యం 15,032 మెగావాట్లకు చేరుతోంది. వచ్చే మూడేళ్లలో మరో 14,426 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిలను రూపొందించి అమలు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే కొత్తగా వచ్చే పరిశ్రమలు, మెట్రో రైల్, వ్యవసాయం, వాణిజ్యం, గృహావసరాలకు కోతల్లేని విధంగా విద్యుత్ సరఫరా చేసే స్థితికి చేరడంతోపాటు మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే అవకాశం లభించబోతోందని ఈ వర్గాలు వెల్లడించాయి.