తెలంగాణ

‘రావి’చరిత్రను పాఠ్యాంశం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరారు. నాడు నిజాం నవాబు పరిపాలనలో జాగిర్దారులు, జమీందార్లు, భూస్వాముల అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడి చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం నాడిక్కడ రావి నారాయణరెడ్డి 109వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ అమరవీరుల ట్రస్టు ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని నారాయణరెడ్డి ఆడిటోరియం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి చాడ పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు తెలంగాణ కోసం పోరాడిన యోధులు, వారి త్యాగాలను ఇప్పటికైనా గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని సిఎంను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల తెరాస ప్రభుత్వ పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ అభ్యుదయ రచయితలకు చాడ వెంకటరెడ్డి సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమమే కాకుండా నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొన్నటి వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమం వరకు ప్రజలను ఒక తాటిపైకి తేవడంలో అభ్యుదయ సాహిత్యం గొప్ప పాత్ర నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ఆదివారం మఖ్ధుం భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు వి.వీరాచారి అధ్యక్షత వహించారు. చాడ వెంకటరెడ్డి ‘అభ్యదయ’ త్రై మాస పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు అభ్యుదయ రచయితలు ముందుకు రావాలని అన్నారు. మూడేళ్ల తెరాస పాలన ప్రజలు ఆశించినట్లు జరుగుతుందో లేదో పరిశీలించాలని కోరారు.