తెలంగాణ

త్వరలో టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర కమిటీని త్వరలో ప్రకటించనున్నట్టు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర కమిటీ కూర్పుపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. దీంట్లో భాగంగా ఆరు అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ఆదివారం ముఖ్యమంత్రి ప్రకటించారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు(మేడ్చల్ జిల్లా), మైనార్టీ విభాగం అధ్యక్షునిగా మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ (కామారెడ్డి), ఎస్సీ విభాగం అధ్యక్షునిగా సుంక రవిశంకర్ (కరీంనగర్ జిల్లా), రైతు విభాగం అధ్యక్షునిగా కంచర్ల రామకృష్ణారెడ్డి (యాదాద్రి జిల్లా), వెనుకబడిన తరగతులు విభాగం అధ్యక్షునిగా ముఠా గోపాల్ (హైదరాబాద్ జిల్లా), కార్మిక విభాగం అధ్యక్షునిగా జి రాంబాబు యాదవ్ (ఖమ్మం జిల్లా) నియమించారు. పార్టీ మహిళా విభాగం, విద్యార్థి విభాగాలకు అధ్యక్షులను ఇదివరకే ప్రకటించారు. అనుబంధ విభాగాలలో ఎస్టీ, వాణిజ్య , లీగల్ విభాగాలకు రెండు మూడు రోజులలో అధ్యక్షులను ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం పూర్తి అయిన తర్వాత రాష్ట్ర కమిటీని ప్రకటించడానికి అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్లతో క్యాంపు కార్యాలయంలో చర్చించినట్టు పార్టీ వర్గాల సమాచారం.