తెలంగాణ

‘ఇరిగేషన్’లో జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కొత్తగా 8.73 లక్షల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర భారీ సాగునీటిపారుదల శాఖ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల రంగంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 6.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించారు. 5.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి కరవు బారినుంచి కాపాడారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించి మూడేళ్లయిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విపక్షాల నుంచి విమర్శలు, సవాళ్లు ఎదురైనా, భూసేకరణ చట్టానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయినా తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రభుత్వం దూసుకుపోతోంది. వచ్చే సంవత్సరం 9.67 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి 3.08 లక్షల ఎకరాలను స్ధిరీకరించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు 123 జీవోను తెచ్చినా, హైకోర్టులో చిక్కులు ఎదురుకావడంతో, తెలంగాణ భూసేకరణ చట్టాన్ని రూపొందించారు. దీనికి రాష్టప్రతి ఆమోద ముద్ర లభించింది. ఈ మధ్యలో ఆరు నెలల కాలం వృథా అయిందని చెప్పవచ్చు. వివిధ ప్రాజెక్టుల్లో సాంకేతిక, డిజైన్ల లోపాలు, నీటి లభ్యతపై తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి, దుమ్ముగూడెం, ఇందిరాసాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను రీ డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి భద్రాద్రి జిల్లాలో దుమ్ముగూడెం వరకు 470 కి.మీ పొడవున్న గోదావరి నదిలో దాదాపు 150 టిఎంసి వరకు నీటిని నిల్వ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు.
ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014-15లో రూ.5285.03 కోట్లు, 2015-16లో రూ..7189.21 కోట్లు, 2016-17లో రూ.15వేల కోట్ల నిధులను ఖర్చుపెట్టారు. ఈ ఏడాది రూ.25వేల కోట్ల వరకు నిధులు కేటాయించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 12 ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్‌ను పూర్తి చేసి వాటి కింద 8.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఆర్డిఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 21.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టు పరిధిలో 30 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.