తెలంగాణ

భూ కుంభకోణం కేసులో పోలీస్ కస్టడీకి యూసుఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మియాపూర్ భూకుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కేసులో బాలానగర్ సబ్-రిజిస్ట్రార్ యూసుఫ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించింది.
బాలానగర్ సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడిన మహమ్మద్ యూసుఫ్‌తోపాటు మహమ్మద్ ముజీబుద్దీన్, వ్యాపారి కృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా దర్యాప్తు పురోగతికోసం తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా బాలానగర్ పోలీసులు మియాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కేసు వాదనలు విన్న న్యాయస్థానం యూసుఫ్‌ను ఎనిమిది రోజులపాటు, మహమ్మద్ ముజీబుద్దీన్, కృష్ణారెడ్డిలను నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. అదేవిధంగా ఈ స్కాంలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు బెయిల్ కోరుతూ ఇటీవల దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. కాగా ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్’ విధానంతో ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఒక డాక్యుమెంట్ రైటర్‌తోపాటు మరో 12మందిపై కేసులు నమోదు చేశారు.