తెలంగాణ

భద్రాద్రి అభివృద్ధికి నమూనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచన మేరకు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక, నమూనా సిద్ధమైంది. ఈ నమూనాకు ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపకల్పన చేశారు. చిన్నజీయర్ స్వామి సలహాను తీసుకుని చిన్న చిన్న మార్పులతో ఈ ప్రణాళిక, నమూనాను రూపొందించారు. భద్రాద్రి ఆలయం అభివృద్ధికి కెసిఆర్ 100కోట్ల రూపాయలను మంజూరు చేశారు.
భద్రాద్రి అభివృద్ధి పనులను గురువారం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ తరహాలోనే భద్రాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై మంత్రి చర్చించారు. ఆర్కిటెక్ట్ ఆనంద సాయి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఆలయ మహారాజ గోపురం మార్పు చేయకుండా, ఆలయ ప్రాకారం, మాడవీధుల్లో మార్పులతో డిజైన్‌ను రూపొందించామన్నారు. సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మండపం, బ్రహోత్సవ మండపం, అన్నదాన సత్రాలను మాత్రమే పునర్నించేందుకు వీలుగా నమూనాలను రూపొందించామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తరామదాసు మెమోరియల్ ట్రస్ట్ డిజైన్‌ను వారం రోజుల్లోగా రూపొందించాలని తుమ్మల సూచించారు. మెమోరియల్ ట్రస్ట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి త్వరలో ఒక ప్రకటన చేస్తారని తుమ్మల వెల్లడించారు.