తెలంగాణ

మరో రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: నైరుతీ రుతుపవనాలు రాకముందే తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వచ్చే రెండురోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 14 నుండి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతీ రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండుమూడు రోజుల్లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణకు విస్తరిస్తాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు ముందుకు సాగేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వివరించారు. బంగాళాఖాతంలో శనివారం ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం రుతుపవనాల కదలికలపై ఉందన్నారు. గత 24 గంటల్లో లక్సెట్టిపేటలో 15 సెంటీమీటర్లు, బోథ్‌లో 14, ఆదిలాబాద్‌లో 8 సెంటీమీటర్లు, రామగుండంలో 7, జూలపల్లి (కరీంనగర్) లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాలు ప్రారంభం కావడంతో పగటివేళ గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్‌లలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
వర్షాలు కురుస్తున్నప్పటికీ, విత్తనాలు వేసేందుకు వీలుగా భూమి తడవకపోవడంతో రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించలేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెట్టపంటల్లో విత్తనాలు వేయడం ప్రారంభించారు.