తెలంగాణ

4వేల మందికి దక్కిన నామినేటెడ్ పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల మందికి పైగా నామినేటెడ్ పదవులు లభించాయి. మార్కెట్ కమిటీల్లో దాదాపు 16వందల మంది, దేవాలయ కమిటీల్లో దాదాపు రెండువేల మందికి పదవులు లభించాయి. ఇప్పటి వరకు మూడు వందల దేవాలయాలకు పాలక వర్గాలను నియమించారు. ఒక్కో దేవాలయంలో ఐదుగురి నుంచి 12 మంది వరకు పాలక వర్గ సభ్యులు ఉన్నారు. దాదాపు రెండువేల మందికి దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల అవకాశం లభించింది. 40 కార్పొరేషన్లలో చైర్మన్‌లు, డైరెక్టర్లు కలిపి దాదాపు 250 మందికి పదవులు లభించాయి.
కాగా,సోమవారం మరిన్ని పదవుల పంపకం జరుగుతుందని టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. 31 జిల్లాలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్‌లను నియమించారు. ఒక్కో జిల్లాకు ఇద్దరి నుంచి ముగ్గురి వరకు డైరెక్టర్లను నియమిస్తారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయిందని, సోమవారం ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. 165 మార్కెట్ కమిటీల చైర్మన్‌ల నియామకం పూర్తయింది. ఒక్కో మార్కెట్ కమిటీలో సగటున పది మంది చొప్పున మొత్తం 1600 మందికి మార్కెట్ కమిటీల్లో స్థానం దక్కిందని టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో 40 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. ఒక్కో కార్పొరేషన్‌లో సగటున ఐదు మంది డైరెక్టర్లు ఉన్నారు. దీంతో దాదాపు 250 మందికి కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవులు లభించాయి. దాదాపు వంద కార్పొరేషన్లు ఉండగా, కొన్ని కార్పొరేషన్లను విలీనం చేయాలని, కొన్నింటిని రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకే విధమైన పనులు చేస్తున్న కార్పొరేషన్లను విలీనం చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్లను రెండు రాష్ట్రాల మధ్య విభజన పూర్తి చేసిన తరువాత వీటిలో నామినేటెడ్ పదవుల నియామకం జరుగుతుంది. గతంలో పలు నామినేటెడ్ పదవులకు గౌరవ వేతనం నామమాత్రంగా ఉండేది. గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవికి సైతం వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఉండేది. ఉద్యమ కారులకు నామినేటెడ్ పదవులు ఇచ్చే సమయంలో ఈ నామినేటెడ్ పదవులకు గౌరవ వేతనాన్ని సైతం గణనీయంగా పెంచారు.