తెలంగాణ

మార్కెట్‌యార్డు కమిటీల్లో రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ మార్కెట్ యార్డుల్లో వివిధ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్కెట్ యార్టుల కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి చేసిన సూచనను అప్పటికప్పుడు బిల్లులో చేర్చుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సభ ఏకగ్రీవంగా స్వాగతించింది. ఈ బిల్లును మంత్రి హరీశ్‌రావుప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు. చిన్నారెడ్డి సూచన బాగుందని, అందుకే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రూ. 1042 కోట్లతో గత రెండేళ్లలో 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేందుకు వీలుగా గిడ్డంగులను నిర్మించామన్నారు. హైదరాబాద్, బోయినపల్లి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీలను ఆన్‌లైన్ పరిధిలో తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, గొంగిడి సునీత, ఆర్ కృష్ణయ్య స్వాగతించారు.
మహిళలకు మార్కెట్ యార్డు కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కోవా లక్ష్మి తదితరులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.