తెలంగాణ

ఢిల్లీ పెద్దల అండతోనే కాంగ్రెస్ భూ కబ్జాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12:్భ కుంభకోణంలో దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తమ భూ భాగోతం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. 2006 నుంచి 2014 వరకు ఢిల్లీ పెద్దల అండతోనే కాంగ్రెస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. టిఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడారు. మియాపూర్ భూ కుంభకోణాన్ని మీడియా బయటపెట్టలేదు, విపక్షాలు బయటపెట్టలేదు, ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా విచారణకు ఆదేశించారని ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు చేసిన భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు బయటపడతాయనే ఆందోళనతో కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సిబిఐ విచారణ జరపాలని కోరడం కేసును నీరు గార్చడానికేనని అన్నారు. దేశంలో రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవడానికి తప్ప సిబిఐ చేతికి వెళ్లిన ఒక్క కేసు కొలిక్కి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతమని విచారణలో నిజా నిజాలు బయటపడతాయని అన్నారు. దోషులు ఎంతటి వారైనా శిక్షణ తప్పవని చెప్పారు. టిఆర్‌ఎస్ సీనియర్ నేత కే కేశవరావు భూములు కొనుగోలు చేయడంపై విమర్శలు చేయడం అన్యాయమని, ఆయన న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. భూ కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుల తప్పు లేదన్నట్టు, టిఆర్‌ఎస్ వాళ్లే ఏదో చేసినట్టు కోదండరామ్ మాట్లాడితే ఆయన గౌరవమే తగ్గుతుందని అన్నారు. కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ వౌత్ పీస్‌గా మారిపోయారని అన్నారు.