తెలంగాణ

బాలిక అదృశ్యంపై కెటిఆర్ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటకు చెందిన ఓ బాలిక అదృశ్యంపై ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ స్పందించారు. బాలిక ఆచూకీ కనుగొనాలంటూ ట్విట్టర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్లను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. దీంతో ఆ బాలిక కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిజాంపేటలోని ఈశ్వర్ విల్లాలో ఉండే పూర్ణిమ అనే విద్యార్థిని ఈనెల 7న స్కూలుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. కానీ స్కూలుకు వెళ్లలేదు. ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధు,మిత్రుల ఇళ్లల్లో వాకబు చేయగా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక అదృశ్యమై వారం రోజులు కావస్తున్నా..ఇంకా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఐటీ శాఖ మంత్రి కేటిఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్పందించిన మంత్రి కేటిఆర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారానే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లను ఆదేశించారు. ఈమేరకు 14 ప్రత్యేక బృందాలు అదృశ్యమైన బాలిక కోసం గాలిస్తున్నాయి.

చిత్రం.. పూర్ణిమ