తెలంగాణ

వారందరిదీ ఒకే మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: కాంగ్రెస్, టిడిపి నాయకులు, టిజెఎసి నాయకులు కోదండరామ్ ఒకే మాట మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఫ్రభుత్వ పనితీరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని, ప్రధాని, కేంద్ర మంత్రులు అభినందిస్తున్నారని, అనేక మీడియా సంస్థలు అవార్డులు ఇచ్చాయని, అయతే కోదండరామ్‌కు మాత్రం కంపు కొడుతున్న ప్రభుత్వంగా ఎందుకు కనిపిస్తోందో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రభుత్వంపై నిష్కారణంగా దుమ్మెత్తి పోయకుండా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కోదండరామ్ అజెండా ఏమిటో ఇప్పటికే ప్రజలకు అర్ధమైందన్నారు. గురుకులాల ఏర్పాటు వల్ల బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందుతుందని, 119 గురుకులాలు ప్రారంభించడంతో బిసి విద్యార్థులకు వరమని ఎమ్మెల్సీలు తెలిపారు. కేజీ నుంచి పీజి వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని అనేక సభల్లో కెసిఆర్ ప్రకటించారని, ఆ దిశగా గురుకులాల ప్రారంభం విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. గురుకులాల ప్రారంభం అనంతరం విద్యా రంగంలో తెలంగాణ కొంత కాలానికి కేరళను మించి పోయి మొదటి స్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్సీలు చెప్పారు.