తెలంగాణ

గజ్వేల్ అభివృద్ధికి రూ.12.50 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: గజ్వేల్ ప్రాంత అభివృద్ధి అథారిటీ (గడా) కి 12.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాంతాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వీలుగా గడాను ఏర్పాటు చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాలను కలిపి గడాగా ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సరఫరా మెరుగుపరచడం, కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యాలయాలకు వసతులు కల్పించడం, విద్యాసంస్థలను ఆదర్శంగా మార్చడం, ప్రజలకు ఇతరత్రా వౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా గడాను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల అవసరాల కోసం ఈ నిధులను విడుదల చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఈ నిధుల వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని ఆదేశించారు. నిధులు వినియోగం తర్వాత యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు 120 కోట్లు
రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ది, సంక్షేమ పనులకోసం 120 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు 75 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు.