తెలంగాణ

స్కూళ్లలో సౌకర్యాలపై సర్కార్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: పాఠశాలల్లో , కాలేజీల్లో సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ విద్యార్థి సంఘాలు ఎలుగెత్తాయి. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్లు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెనుకడుగు వేయడం కార్పొరేట్ కాలేజీలకు రెడ్ కార్పెట్ పరచడమేనని పేర్కొంటూ ఎబివిపి రాష్ట్ర బంద్ నిర్వహించింది. కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలు మిస్సింగ్‌లపై విచారణ జరిపించాలని, కార్పొరేట్ కాలేజీలకు అమ్ముడు పోయిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ఎబివిపి పిలుపునిచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయాలని ఎబివిపి నేతలు డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీల్లొ జరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలని ఎబివిపి నేతలు కోరారు. జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి, మెరుగైన వౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. మరో పక్క ఎస్‌ఎఫ్‌ఐ నేతలు స్కూళ్లను ముట్టడించగా, గురువారం నాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఎఐఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దోపిడీకి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వేణు తెలిపారు.