తెలంగాణ

ఈ ఏడాది 3.50 లక్షల గొర్రెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: గొర్రెల పంపిణీ పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కొనుగోలు చేసే ప్రతి గొర్రెకు ట్యాగింగ్ చేయాలని సూచించారు. గొర్రెల పంపిణీ పథకానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణీకి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎస్‌పి సింగ్ తెలిపారు. ఈ ఏడాది సుమారు 3 లక్షల 50 వేల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. గొర్రెల పంపిణీపై బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, గొర్రెల కొనుగోలు, పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. మొదటి విడతలో ఎంపికైన సభ్యుల వివరాలను ఇ-ల్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. గొర్రెల ట్యాగింగ్, ఇన్సూరెన్స్ చేయడానికి తగిన సిబ్బందిని నియమించాలన్నారు. గొర్రెల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వైద్యులను నియమించాలన్నారు. లబ్ధిదారుల వాటా కింద చెల్లించే 25 శాతం డబ్బును డిడిల రూపంలోనే తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా మాట్లాడుతూ, గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన నియమ, నిబంధనలను కలెక్టర్లకు ఇప్పటికే పంపించామన్నారు. గొర్రెలను కొనుగోలులో డబ్బుల చెల్లింపులన్నీ అకౌంట్ ద్వారానే జరుగాలన్నారు. గొర్రెలను విక్రయించే వారి ఆధార్, ఐడి కార్డుల వివరాలను తప్పని సరిగా సేకరించాలన్నారు. గొర్రెల మేత కోసం స్టైలో గ్రాస్ విత్తనాలు 4 టన్నులు జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. సొంత పొలాల్లో గడ్డి పెంపకానికి ముందుకు వచ్చే వారికి 75 శాతంతో రాయితీతో విత్తనాలు సరఫరా చేయాలని సురేష్ చందా సూచించారు. సాదాబైనామా కేసులను ఈ నెల 21లోగా పరిష్కరించాలని, అనంతరం దీని వెబ్‌సైట్ అందుబాటులో ఉండదని ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ గుర్తు చేశారు.