తెలంగాణ

అతీగతీలేని సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమైనా, ఇంత వరకూ పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందకపోగా, కనీస సౌకర్యాలు కూడా అందుబాటులోకి రాలేదు. స్కూళ్లు ప్రారంభించే నాటికి అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం అనేక మార్లు సూచించినా, స్కూళ్లలో కొత్త విద్యాసంవత్సరంలోనూ అవే వెతలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు రంగురంగుల్లో పోస్టర్లు వేసి, కొత్త కొత్త రంగులతో హంగులతో విద్యార్ధులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండగా, ప్రభుత్వ పాఠశాలలు పాత సమస్యలను తలకెత్తుకుని విద్యార్ధుల కోసం ఎదురుచూస్తున్నాయి.
గ్రామాల్లో కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కాలికి బలపం కట్టుకుని ఇంటింటికీ వెళ్లి విద్యార్ధులను తమ స్కూళ్లలో చేర్చాలని ప్రాధేయపడుతున్నా అనుకున్నంత ప్రోత్సాహకర సమాధానం తల్లిదండ్రుల నుండి రావడం లేదు. విద్యార్ధులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లపై మొగ్గుచూపుతున్నారని దానికి కారణం ఆయా స్కూళ్లలో అమలుచేస్తున్న ఇంగ్లీషు మీడియం క్లాసులేనని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంగ్లీషు మీడియం కంటే మాతృభాషలో ఎక్కువగా విషయ అవగాహన ఉంటుందని టీచర్లు వారికి అర్ధమయ్యేలా చెప్పేప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సైతం మొక్కుబడిగా సాగుతోంది. పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు ఖచ్చితంగాపెంచాలనే ప్రభుత్వ వత్తిడితో టీచర్లు, స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా స్కూళ్ల నమోదు పెంచే ప్రయత్నం చేస్తునే ఉన్నా, అది కాగితాలకే పరిమితం అవుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. కలెక్టర్ల ఫండ్‌తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులను రాబట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నా, అందుకు తగ్గట్టు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో పాఠశాలల హెడ్మాస్టర్ల స్థాయి వ్యక్తులు కార్పొరేట్ సంస్థలను ఒడిసి పట్టుకోలేకపోతున్నారు.
రాష్టస్థ్రాయిలోనే భారీ ఎత్తున కార్పొరేట్ సంస్థలను సమీకరించి నిధులను పోగు చేసి, వాటిని స్కూళ్లతో లింక్ చేయాలనే భావన వ్యక్తమవుతోంది. ప్రతి పాఠశాలకు చిల్లర వ్యయం కింద కొంత మేరకు నిధులు కేటాయించినా, అవి ఏ విధంగానూ సరిపోవడం లేదని టీచర్లు చెబుతున్నారు. సిసి కెమరాలు, ఆర్వో ప్లాంట్లు, బయోమెట్రిక్ మిషన్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటి భారీ లక్ష్యాలతో స్కూళ్లు తెరచుకున్నా వ్యవహారాలు మాత్రం నత్తనడక సాగుతున్నాయి. చాలా పాఠశాలల్లో ఇంకా సివిల్ పనులు పూర్తికాలేదు. సున్నం కలర్స్ వేయించి వాటికి కొత్త శోభను తీసుకురావాలన్న లక్ష్యానికి నిధుల కోత కూడా అడ్డంకిగా తయారైంది.