తెలంగాణ

తెలంగాణలో 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ వ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని 31 జిల్లాల వ్యాప్తంగా విస్త్రంగా విస్తరించడంతో అధిక వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 23 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం పడుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత 584 మండలాల్లో 68 శాతం అంటే 400 మండలాల్లో భారీ వర్షం నమోదు కాగా, మరో 99 మండలాల్లో సాధారణంగా వర్షం కురిసినట్లు రికార్డు అయ్యింది. ఇంకా 62 మండలాల్లో పడాల్సిన వర్షం కన్నా తక్కువ పడగా, మరో 23 మండలాల్లో అసలు వర్షపాతమే నమోదు కాలేదని ఈ నెల 15 వరకు నమోదైన వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ వారంలో 16వ తేదీన 147 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నిర్మల్ జిల్లాలోని కుంటాలలో నమోదు అయ్యింది.