తెలంగాణ

వచ్చేస్తోంది.. అమెజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30:ఇ- కామర్స్‌లో ప్రపంచ దిగ్గజం గచ్చిబౌలిలో అతి పెద్ద క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమెరికాలోని క్యాంపస్ తరువాత ఇదే అతి పెద్ద క్యాంపస్. 10 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. 2019 నాటికి ఇది పూర్తవుతుంది. క్యాంపస్ నిర్మాణానికి ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సెంటర్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం లభించనుంది. తెలంగాణను అమెజాన్ తన కేంద్రంగా ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ఆర్థిక రంగానికి ఊతం లభిస్తుందని అన్నారు. అమెజాన్ జనరల్ కౌన్సిల్ డేవిడ్ మాట్లాడుతూ అమెజాన్ ఐటి కార్యకలాపాలకు 2005-06 నుంచి హైదరాబాద్ తమ కేంద్రంగా ఉందని తెలిపారు. భారత దేశంలో పెట్టుబడులకు తెలంగాణ తమ సంస్థకు అత్యధిక ప్రాధాన్యత గల ప్రదేశం అని తెలిపారు. ఆన్‌లైన్ వ్యాపారంలోనే కాకుండా ఐటి రంగానికి అనేక దేశాలకు సంబంధించి కార్యకలాపాలు ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తారు. 4న ఐటి పాలసీ ప్రకటన
ఏప్రిల్ నాలుగవ తేదీన ఐటి పాలసీని ప్రకటించనున్నట్టు ఐటి మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నట్టు కెటిఆర్ తెలిపారు. అమెజాన్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన తరువాత మీడియాతో మాట్లాడారు. దేశంలో అతి పెద్ద ఇంక్యుబెటర్ టి- హబ్‌ను నెలకొల్పినట్టు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. నాలుగవ తేదీన ఐటి పాలసీ ప్రకటించే కార్యక్రమంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో సహా పలు ఐటి దిగ్గజ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. అదే రోజు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదుర్చుకుంటాయని తెలిపారు. మేకిన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీలను ప్రోత్సహిస్తామని, పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కెటిఆర్ తెలిపారు. ఐటిని ద్వితీయ నగరాలకు విస్తరించేట్టు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్, యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ పాలసీలను ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. రూరల్ టెక్నాలజీ పాలసీ ప్రకటిస్తామని, ఐటి ద్వారా గ్రామాల్లో మెరుగైన సెవలు అందిస్తామని చెప్పారు. ఈ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కెటిఆర్ తెలిపారు.