తెలంగాణ

పనికొచ్చే చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: త్వరలో నూతన విద్యా విధానంపై సమగ్ర కార్యాచరణ విడుదల చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో హామీ ఇచ్చారు. విద్యా రంగంలో నిపుణులైన వారితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విద్యా విధానంపై స్వల్ప వ్యవధి ప్రశ్న కింద సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిన్తూ విద్యా శాఖను గాడిలో పెడతామని, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. అక్షరాస్యత, పాఠశాలలకు పిల్లలను తీసుకుని రావడంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. ఇందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు 54 శాతం, ప్రభుత్వ పాఠశాలలకు 46 శాతం మంది విద్యార్థులు వెళుతున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు లోగడ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని, ఇప్పుడు కొందరిలో ఆసక్తి తగ్గిందని అన్నారు. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే బర్లు, గొర్లు చూసుకునే పిల్లలు బడి బాట పట్టాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలురకు, బాలికలకు వేర్వేరుగా టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయిస్తున్నామని, మంచి నీరు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి పాఠశాలకు తప్పని సరిగా విద్యుత్తు సౌకర్యం, వంట శాల ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, వౌలిక వసతులు తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నెల రోజుల్లో సమాచారం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిన్తూ నర్సరీ నుంచి దశల వారీగా ఇంగ్లీషు మీడియంలోకి ప్రభుత్వ పాఠశాలలను మార్చేందుకు ఆలోచన చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించాలన్న ఆలోచన చేస్తున్నారని, చివరకు కూలీలు సైతం తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారని ఆయన చెప్పారు. వెంటనే ఇంగ్లీషు మీడియంలో పాఠశాలలను ప్రారంభించవచ్చు కానీ శిక్షణ పొందిన టీచర్లు అందుబాటులో లేరని అన్నారు. కెజి నుంచి పిజి వరకు సిబిఎస్‌సి సిలబస్ ఉండాలని సిఎం ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. నూతన రాష్ట్రానికి నూతన విద్యా విధానానికి ప్రయత్నిస్తున్నామని, విద్యా రంగంలో నిపుణులైన వారితో కమిటీని నియమించి, మూడు నెలల్లో నివేదిక తెప్పించుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. నిధులకు కొరత లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేశామని ఆయన తెలిపారు. గ్రామాల్లో కొన్ని పాఠశాలల్లో 10 నుంచి 20 మంది విద్యార్థులే ఉంటున్నారని, అవసరమైన సిబ్బంది ఉండడం లేదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక, ఉన్నత విద్య పాఠశాలలను ఒకే దగ్గరికి తీసుకుని వచ్చి, ఆ విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్‌లో ఉచిత విద్యను అందుబాటులోకి తెచ్చి, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇచ్చామని, ఫీజు లేదని అన్నారు. కార్పోరేట్ విద్యా సంస్ధలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. 45 కోట్ల రూపాయలతో 31 డిగ్రీ కళాశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని, లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని, 14 పాలిటెక్నిక్ కళాశాలలకు భవనాలను, సిబ్బందిని సమకూరుస్తున్నామని ఆయన వివరించారు. 11 యూనివర్సిటీలకు 2753 సిబ్బంది ఉండాలని, అయితే కేవలం 1200 మంది మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. రెండు దశాబ్దాలుగా నియమాకాలు లేవని, ఉస్మానియా వర్సిటీ నుంచి ఇంకా ఎక్కువ మంది పదవీ విరమణ చేస్తే ‘న్యాక్‌‘ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు ఛాన్సలర్, విసిలను నియమిస్తామని ఆయన తెలిపారు. సమగ్ర ప్రణాళికతో నూతన విద్యా విధానాన్ని అసెంబ్లీలో పెడతామని కడియం శ్రీహరి చెప్పారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లక్ష్మణ్ అడిగిన మరో ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి శ్రీహరి సమాధానమిస్తూ 12 ఇంటర్నేషనల్ పాఠశాలలకు నోటీసులు ఇచ్చామని అన్నారు. అవి: చిరక్, డిపిఎస్, సన్‌సిటీ, జాన్సన్ గ్రామర్ స్కూల్, ఒక్రిడ్జ్, శాంతా, సంగమిత్ర, జూబ్లీహిల్స్ స్కూల్, విద్యారణ్య పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిన్తూ వేరే రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఆర్‌టిఇని అమలు చేసేందుకు కొన్ని విద్యాహక్కు చట్టం అమలు వల్ల ప్రయోజనాలు ఉన్నాయని, మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెబుతూ కాబట్టి కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదని వివరించారు. రాజకీయ విమర్శలు లేకుండా అందరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీహరి కోరారు. ఈ చర్చలో ఆర్. కృష్ణయ్య (టిడిపి), పాయం వెంకటేశ్వర్లు (వైకాపా), రవీంద్ర కుమార్ (సిపిఐ), హనుమంతు షిండే, చెన్నమనేని రమేష్ (టిఆర్‌ఎస్), సున్నం రాజయ్య (సిపిఎం), అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్) తదితరులు పాల్గొన్నారు.