రాష్ట్రీయం

24, 25 తేదీల్లో ద్వారకా తిరుమలలో అంతర్జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 24, 25 తేదీ ల్లో ‘అంతర్జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం’ జరగనున్నది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జిహెచ్‌హెచ్‌ఎఫ్), సేవ్ టెంపుల్స్, ఆర్గ్, (యుఎస్‌ఎ), అసోసియేషన్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ హిందూ రిలీజియస్-్ఛరిటబుల్ ఇనిస్టిట్యూషన్స్ (ఎపి) సంయుక్తంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు సంస్ధ అధినేతలు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశ్ రావు, ఎస్‌వి సుధాకర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బిజెపి నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఇంకా హైందవ ధార్మిక సంస్ధల అధినేతలు, వివిధ హిందూ పీఠాధిపతులు, దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రానునన్నట్లు వారు వివరించారు. ఈ సదస్సులో ప్రాచీన దేవాలయాల పరిరక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేవాలయాల రక్షణ, గోసంరక్షణ, అర్చక సంక్షేమం వంటి అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సమ్మేళనంలో పాల్గొనదలచిన వారు ఫోన్ నెంబర్ 99126 26256లో సంప్రదించవచ్చని లేదా మీ వివరాల ను ‘సేవ్‌టెంపుల్స్‌భారత్’జిమెయిల్‌కు పంపవచ్చని వారు తెలిపారు. లేదా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. సేవ్‌టెంపుల్స్.ఓఆర్‌జి వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆ సంస్థ సాంస్కృతిక రాయబారి డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.