తెలంగాణ

జోనల్ రద్దు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18:జోనల్ వ్యవస్థ రద్దుపై ఉద్యోగ వర్గాల్లో తిరిగి చర్చనియాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భవించి కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జోనల్ వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదన ప్రభుత్వం ముందుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత 371డి ప్రాధాన్యత కోల్పోయిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 371 డి ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జోనల్ వ్యవస్థకు అర్థం లేదని, 371 డి ప్రాధాన్యత కోల్పోయింది అనేది ప్రభుత్వ వాదన. జోనల్ వ్యవస్థను తొలగించేందుకు గత రెండేళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. టిఎన్‌జివోతో సహా తెలంగాణలోని ప్రధానమైన ఉద్యోగ సంఘాలు జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం జిల్లా పోస్టులు, జోనల్ పోస్టులు, రాష్ట్ర పోస్టులు ఉన్నాయి. గతంలో ఉన్న పది జిల్లాల స్థానంలో మొత్తం 31 జిల్లాలు ఏర్పడినందున జోనల్ వ్యవస్థ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. మూడంచెల విధానానికి బదులు జిల్లా పోస్టులు, రాష్ట్ర పోస్టులు మాత్రమే ఉంటాయి. జోనల్ వ్యవస్థను తొలగించే విధంగా ఆర్టికల్ 371 డికి సవరణలు చేయాలని రాష్టప్రతిని కోరుతూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్టప్రతికి పంపిస్తారు.
జోనల్ వ్యవస్థ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అమలు కావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇప్పట్లో ఈ విధానం అమలు అంత సులభం కాదు. రాష్టప్రతికి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తుంది. కొత్త రాష్టప్రతి ఎన్నిక హడావుడి మొదలైంది. కొత్త రాష్టప్రతి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై నిర్ణయాలే ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా 371 డిని సవరించి, జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు అంత త్వరగా రాష్టప్రతి నుంచి సుముఖత వ్యక్తం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉభయ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం, 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థలపైనే మూడేళ్లయినా కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల పంపిణీ పూర్తి స్థాయిలో జరగనప్పుడు, జోనల్ వ్యవస్థ రద్దు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. గుర్తింపు పొందిన సంఘాల నాయకులంతా జోనల్ వ్యవస్థ రద్దుకు సానుకూలత వ్యక్తం చేయగా, ఇతర సంఘాలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశారు. త్వరలోనే ఈ కమిటీ తన పని ప్రారంభించనుంది.