తెలంగాణ

నెత్తురోడుతున్న రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ నగర రోడ్లు మూడు ప్రమాదాలు, ఆరు మరణాలు అన్నట్లు దడపుట్టిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో గడచిన ఐదు నెలల్లో 968 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 35 మంది మరణించారు. 981 మంది గాయాలపాలయ్యారు. ఇదిలావుంటే హైదరాబాద్ నగర ప్రాంతాన్ని తలదనే్నలా సైబరాబాద్, రాచకొండ ప్రాంతలో గడచిన నాలుగు నెలల్లోనే ఏకంగా 1,137 రోడ్డు ప్రమాదాలు జరిగి, 266 మంది చనిపోగా, 254 మంది తీవ్రంగా, మరో 925 మంది గాయాలపాలయ్యారు.
నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండడమే రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ కారణమవుతుంటే, చాలా సంఘటనల్లో మానవ తప్పిదాలు మరో కారణం. సరైన రోడ్డు సౌకర్యం ఉంటే మానవ తప్పిదం జరగకుండా ప్రమాదాలను నివారించేందుకు వీలు ఉంటుందని అధ్యయన అంచనాలు చెబుతున్నాయి. రోడ్డు సక్రమంగా ఉన్నా మానవ తప్పిదాలు చాలా సందర్భాల్లో ఉండడం వల్లే ఘోర సంఘటనలు నమోదు అవుతున్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు, నిబంధనలు అమలు చేసినా వాటిని ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడపడం, సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడపడం, రెడ్ సిగ్నల్ ఉన్నా ముందుకు వెళ్లడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసు విభాగం చెబుతోంది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉంటే కనీసం 50 శాతం ప్రమాదాలను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిబంధనలు పట్టించుకోని వారికి జరిమానాలు విధిస్తున్నా లెక్క చేయని పరిస్థితి ఉంది. ఇందుకు మరింత జరిమానా విధిస్తే తప్ప నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడం సాధ్యం కాదని అంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 2015లో నమోదైన ప్రమాదాలు, మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. 2015 జనవరి నుంచి మే వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1031 ప్రమాదాలు జరగ్గా, 144 మంది చనిపోయారు.
అదే సైబరాబాద్, రాచకొండ కమినరేట్లు కలిపి 2015 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 1254 ప్రమాదాలు జరగ్గా, 368 మంది చనిపోయారు. ఇక 2016లో హైదరాబాద్ పరిధిలో 1003 ప్రమాదాలు జరిగి, 173 మంది చనిపోతే, సైబరాబాద్, రాచకొండలో 802 ప్రమాదాలు జరిగి 276 మంది చనిపోయారు. 2017లో 986 ప్రమాదాలు హైదరాబాద్‌లో జరిగి, 135 మంది చనిపోగా, మిగిలిన రెండు కమిషనరేట్ల పరిధిలో 1137 ప్రమాదాల్లో 266 మంది చనిపోయారు. ఇలా ప్రతి ఏడాది ప్రమాదాల గ్రాఫ్ పెరగడం, దానికి అనుగుణంగానే మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది రానున్న రోజుల్లో మరింత ఆందోళనకు గురి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.